Tuesday, 28 July 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / అంతర్జాతీయ వార్తలు

ఇరాన్ రివేంజ్ హిట్‌లిస్ట్‌ కలకలం..జాబితాలో 13 మంది ప్రపంచ నేతలు... !

13 Jul 2026
01:41 PM
106

* ట్రంప్, నెతన్యాహు, మెలోనీ...
* ఇరాన్‌ లోని హమ్‌షహ్రీ పత్రిక ప్రచురించిన కథనం
* అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపిన హిట్ లిస్ట్ ...
* ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితులను మరింత వేడెక్కించిన హిట్ లిస్టు....


Iran revenge list   : 

ఇరాన్‌లో ప్రముఖ దినపత్రిక హమ్‌షహ్రీ (Hamshahri) ప్రచురించిన ఒక కథనం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో పాటు మొత్తం 13 మంది విదేశీ రాజకీయ నాయకుల చిత్రాలను ఉంచి, వారిని ఇరాన్ ప్రతీకార లక్ష్యాలుగా పేర్కొంది. ఇప్పటికే ఇరాన్ కొత్త సుప్రీం ఖమేనీ సైతం..దశాబ్దాలుగా ఇరాన్‌కు మార్గనిర్దేశం చేసి, ముందుకు నడిపిన సుప్రీం లీడర్ హత్యకు తప్పనిసరిగా ప్రతికారం తీర్చుకుంటాం. పగ తీర్చుకోవాలన్నది మా దేశ సంకల్పం. దీనిని ఎలాగైనా నెరవేర్చుకుంటాం. ఈ జాబితాలో ఉన్న నేరస్థులు, ప్రాణాలు వదిలి సమాధుల్లోకి వెళ్తారు. ఇరాన్ ప్రభుత్వం ఎవరిని టార్గెట్ చేయనుందో వారి జాబితాను సైతం సిద్ధం చేసిందని మొజ్తబా ఖమేనీ చెప్పారు. అయితే, సుప్రీం లీడర్ ఎవరి పేర్లను స్పష్టంగా వెల్లడించలేదు. నేపధ్యంలో ఇప్పుడు హిట్ లిస్టు పేరుతో  హమ్‌షహ్రీ పత్రిక ప్రకటించడంతో ఈ పరిణామం ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితులను మరింత వేడెక్కించినట్లయ్యింది. (Iran revenge list).

Article Image

ఇరాన్ లో అతివాద వైఖరికి పేరుగాంచిన ఆ పత్రిక ప్రచురించిన రివేంజ్ లిస్ట్‌లో డొనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో పాటు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తదితరుల పేర్లు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరాన్ అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారం తప్పదనే సందేశంతో ఈ పోస్టర్‌ను ప్రచురించినట్లు తెలుస్తోంది.   

ఈ పరిణామం నేపథ్యంలో ఆయా దేశాల భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయని, దౌత్యపరంగా కూడా పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయని అంతర్జాతీయ మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి (Iran latest news). మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ జాబితా మరింత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. తనను హత్య చేసేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని ట్రంప్ ఇప్పటికే పలుసార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే.


ఈ జాబితాలోని ప్రముఖుల వివరాలు :
అమెరికా :
డొనాల్డ్ ట్రంప్ (అమెరికా అధ్యక్షుడు)
మార్కో రూబియో (అమెరికా విదేశాంగ మంత్రి)
పీట్ హెగ్‌సెత్ (అమెరికా రక్షణ మంత్రి)
మైక్ హకబీ (ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబారి)
మైఖేల్ 'ఎరిక్' కురిల్లా, బ్రాడ్ కూపర్ (అమెరికా సైనిక అధికారులు - CENTCOM)

ఇజ్రాయెల్ :
బెంజమిన్ నెతన్యాహు (ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి)
ఇజ్రాయెల్ కాట్జ్ (ఇజ్రాయెల్ రక్షణ మంత్రి)
గిడెన్ సార్ (ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి)
ఎయాల్ జమీర్ (IDF చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్)

యూరప్  :
కీర్ స్టార్మర్ (బ్రిటన్ ప్రధాన మంత్రి)
జార్జియా మెలోని (ఇటలీ ప్రధాన మంత్రి)
ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (ఫ్రాన్స్ అధ్యక్షుడు)
ఫ్రెడరిక్ మెర్జ్ (జర్మనీ ఛాన్సలర్)

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అయతుల్లా ముజ్తాబా ఖమేనీ కూడా తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని పదేపదే హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ జాబితా అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది.

Article Image

* ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితులను మరింత వేడెక్కించిన హిట్ లిస్టు.... : 
అమెరికా, ఇరాన్ల మధ్య ఉద్రిక్తత ప్రమాదకరంగా మారుతోంది. ఇదివరకే ఇరుదేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. మరోసారి ఇరాన్ ప్రతినిధులతో శాంతి చర్చలు జరిపేది లేదని స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధిలో ఒక కంటైనర్ నౌకపై దాడి తర్వాత, అమెరికా ఒకే వారంలో మూడోసారి ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడి చేసింది. ఇరాన్ లోని ఇంధన నిల్వ కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా సుమారు 6 వేల క్షిపణులను ప్రయోగించింది. దీంతో అమెరికా దాడులకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటోంది. గల్ఫ్ ప్రాంతంలోని పలు దేశాలలో ఉన్న అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైల్స్ ప్రయోగిస్తున్నట్లు ప్రకటించింది. దీనితో ఆ ప్రాంతం అంతటా హై అలర్ట్ ప్రకటించారు. ఫలితంగా హర్మూజ్ జలసంధి మరోసారి మూసివేయడంతో చమురు రవాణాకు ఆటంకం తలెత్తుతోంది.

 

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!