Tuesday, 24 November 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

కడప జిల్లాలో సర్పంచ్ బరిలో 22 ఏళ్ల యువతి...! 

14 Nov 2026
04:20 PM
38

Astranews :

కడప జిల్లా పంచాయతీ ఎన్నికల్లో ఓ యువతి పోటీ చెయ్యనుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల మండలం టేకూరుపేట సర్పంచ్ అభ్యర్థిగా 22 ఏళ్ల నగిరి శివసాహితీ అనే యువతి పోటీకి సిద్ధమవ్వడం చర్చనీయాంశంగా మారింది.

అధికార తెలుగుదేశం పార్టీ మద్దతుతో ఆమె ఎన్నికల బరిలో దిగుతున్నారు. శివసాహితీ తండ్రి భైరవ ప్రసాద్ పోరుమామిళ్ల టీడీపీ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలనే నినాదానికి నిదర్శనంగా శివసాహితీ పోటీ చేస్తోందని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు.

కాగా చిన్న వయసులోనే సర్పంచ్ గా పోటీ చేయనుండటంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ మేరకు సోమవారం ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!