Indonesia :
ఇండోనేషియాలో భారీ విషాదం చోటుచేసుకుంది. ఇండోనేషియా సమీపంలోని జావా సముద్రంలో భారీ నౌక గల్లంతైంది. ఈ ఘటన ఇండేనేషియాలో తీవ్ర ఆందోళనకు గురిచేస్తొంది. ఆదివారం 240 మంది ప్రయాణికులతో తూర్పు జావా నుంచి కాళీమంతన్‌కు బయల్దేరిన ‘విర్గో ట్రాన్స్‌పోర్ట్ 8’ నౌకతో ఒక్కసారిగా కమ్యూనికేషన్ తెగిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు. సురబాయ్ నుంచి బయల్దేరిన తర్వాత కమ్యూనికేషన్ కట్ సురబాయ్ నుంచి బయల్దేరిన నౌక కొంతదూరం ప్రయాణించిన అనంతరం దానితో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు తెలిపారు. చివరిసారిగా బంజార్‌మసన్‌కు సుమారు 148 కిలోమీటర్ల దూరంలో నౌకతో కమ్యూనికేషన్ జరిగినట్లు వెల్లడించారు.
ప్రతికూల వాతావరణం.. నౌక కోసం ముమ్మరంగా గాలింపు ... :
నౌక చివరిసారిగా సంప్రదింపులు జరిపిన సమయంలో సముద్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నట్లు సమాచారం. ఆదివారం ఉదయం నుంచి స్థానిక అధికారులు నౌక కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. 240 మంది ప్రయాణికులు, సిబ్బందితో నౌక గల్లంతవడంతో వారి పరిస్థితిపై ఆందోళన నెలకొంది. నౌక ఆచూకీ కోసం సముద్రంలో విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కానీ ఇప్పటికి అచూకి దొరకకపోవడంతో ఇటు నైక సిబ్బంది కుటుంబీకుల్లోను... అటు ప్రయాణీకుల కుటుంభాల్లో తీవ్ర ఆందోళన రేపుతొంది.