Tuesday, 28 July 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / జాతీయ వార్తలు

రాహుల్ గాంధీకి TN CM విజయ్ మద్దతు...!

22 Jul 2026
06:09 PM
23

* నీట్‌ను పూర్తిగా రద్దు చేయాలి.... టీవీకే డిమాండ్

Astranews  :
ఢిల్లీలో నీట్ (NEET) పరీక్ష లీకేజీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులకు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పూర్తి మద్దతు ప్రకటించారు. రాహుల్ గాంధీ, ఇతర విపక్ష నాయకుల అరెస్టును ఆయన ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తీవ్రంగా ఖండించారు.
రాహుల్, ఇతర ప్రతిపక్ష నేతలను నిర్బంధించడం అప్రజాస్వామికమని ట్వీట్ చేశారు. 'ప్రతిపక్ష పార్టీల నిరసనలకు మా పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. నీట్ పరీక్ష విద్యార్థులను, వారి కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. NEETను రద్దు చేయాలి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తప్పుడు హామీలు ఇవ్వకూడదు' అని విమర్శించారు. వైద్య విద్యను కేంద్రం పరిధి నుంచి రాష్ట్రాల జాబితాకు మార్చడమే దీనికి సరైన పరిష్కారం అని ఆయన తెలిపారు. ఇందుకు న్యాయపరంగా ఏవైనా అడ్డంకులుంటే వాటిని తొలగించే వరకు తాత్కాలికంగా ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని విజయ్‌ సూచించారు.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!