• 13 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు...
• తాము విడిపోతున్నా...మంచి స్నేహితులుగా కొనసాగుతూ...
• పిల్లల బాధ్యతలను చూసుకుంటామని లేఖలో వెల్లడి...
Astranews desk : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, భార్య అన్నా లెజినోవా డైవర్స్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు నోట్ రిలీజ్ చేశారు. వైవాహిక బంధం ముగిసినా మంచి స్నేహితులు, బాధ్యతగల తల్లిదండ్రులుగా కొనసాగుతామన్నారు. తమ ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ ప్రయాణంలో అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు. జనసేన అఫీషియల్ వాట్సాప్ గ్రూపులో ఈ నోట్ పోస్ట్ చేశారు. దీంతో 13 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత తాము విడిపోతున్నామని, మంచి స్నేహితులుగా కొనసాగుతూ తమ పిల్లల బాధ్యతలను చూసుకుంటామని వెల్లడించారు.

• పవన్ కల్యాణ్ వివాహాలు...విడాకుల వివరాలు:
• ◦ మొదటి భార్య - నందిని: 1997లో నందినిని వివాహం చేసుకున్నారు. 2008లో వీరికి విడాకులు మంజూరయ్యాయి.
• ◦ రెండవ భార్య - రేణు దేశాయ్: 2009లో నటి రేణు దేశాయ్‌ను వివాహం చేసుకోగా, వీరు 2012లో విడాకులు తీసుకున్నారు. వీరికి అకిరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
• ◦ మూడవ భార్య - అన్నా కొణిదెల (అన్నా లెజ్నెవా): సెప్టెంబర్ 2013లో వివాహం చేసుకున్నారు. వీరికి పోలేనా అంజన పవనోవా, మార్క్ శంకర్ పవనోవిచ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వీరు కూడా పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు.