Monday, 30 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

BIG BREAKING ... వైజాగ్ ఫిషింగ్ హార్బర్‌లో నో డీజిల్ ... !

25 Mar 2026
01:51 PM
69

వైజాగ్ ఫిషింగ్ హార్బర్‌లో నో డీజిల్ ... !
* హార్బర్‌కే పరిమితమైన 500 పైగా బోట్లు ...
* సబ్సిడీ ఇవ్వకపోగా డీజిల్ సరఫరా కూడా నిలిపేసిన ప్రభుత్వం 
* తక్షణమే ప్రభుత్వం స్పందించాలంటున్న మత్స్యకారులు 
* ఐదు రోజుల నుంచి డీజిల్ సరఫరా బంద్ 
* పెంచిన డీజిల్ ధరను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్న మత్స్యకారులు

Article Image
విశాఖపట్నం  : 

పశ్చిమాషియాలో నెలకున్న ఉద్రిక్త పరిస్ధితుల వల్ల ప్రపంచ మొత్తం తీవ్ర ప్రభావం చూపుగా...ఇప్పుడు ఎపీలోని వైజాగ్ ఫిషింగ్ హార్బర్‌లో మత్యకారులపై పెనుప్రభావమే చూపింది.  మత్స్య దిగుబడుల్లో కీలకపాత్ర పోషిస్తున్న విశాఖ హార్బర్‌లో చేపల వేట నిలిచిపోయింది. దీంతో దాదాపు 500లకు పైగా బోట్లు హర్బర్ కే పరిమితమయ్యాయి. మొత్తం 800లకు పైగా ఇక్కడ బోట్లు ఉండగా, వాటిలో 500లకు పైగా బోట్లు నలిచిపోయాయి. ఈ కారణంగా ట్యూనా చేపల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇక్కడి నుంచి రోజుకు సుమారు 200 టన్నుల ట్యూనా చేపలను కేరళలో ప్రాసెస్‌ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు. అయితే పశ్చిమాసియా దేశాలకు రవాణా అంతరాయం కలగడంతో ఎగుమతులు భారీగా పడిపోయాయి. ఇక్కడి చేపల రేవులో 680 బోట్లు ఉండగా సుమారు 200పైగా బోట్లు ట్యూనా చేపల వేట సాగిస్తున్నాయి.

సబ్సిడీ ఇవ్వకపోగా డీజిల్ సరఫరా కూడా నిలిపేసిన ప్రభుత్వం .. :

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మత్స్యపరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పరిశ్రమలకు సరఫరా చేసే డీజిల్‌ ధరలను కేంద్రం భారీగా పెంచడంతో బోటు ఆపరేటర్లు గగ్గోలు పెడుతున్నారు. ధరల పెంపు నుంచి తమను మినహియించాలని మత్యకారులు కోరుతున్నారు. పర్రిశమలకు సరఫరా చేసే డీజిల్‌ ధరను లీటర్‌కు రూ. 22 మేరా చమురు సంస్థలు పెంచాయి. పన్నులతో కలిపి లీటరు రూ.123.70కు చేరింది. ప్రస్తుత చేపల రేవులో బోటు ఆపరేటర్లకు లీటర్‌కు రూ.9 చొప్పున క్రేందం రాయితీ ఇస్తోంది. రాయితీ పోను లీటరు రూ.87.22లకు లభిస్తోంది. ఇప్పుడు 23.70లు పెరగడంతో ధర రూ.110.92లకు చేరింది. తప్పనిసరి పరిస్థితిలో ఇదే ధరకు పలువురు ఆపరేటర్లు డీజిల్‌ కొనుగోలు చేసి బోట్లను చేపలు వేటకు పంపారు. కాగా అధిక శాతం బోట్లు తీరంలోనే నిలిచిపోయాయి. ఎండలు ముదురుతుండడంతో చేపల వేట సవ్యంగా సాగడం లేదని, ఈ పరిస్ధితి కారణంగానే దిగుబడులు తగ్గాయని, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డీజిల్‌ ధరలపై మినహాయింపు ఇచ్చేలా చూడాలని  మత్యకారులు వేడుకుంటున్నారు. మరో వైపు ఈ రాయితీ విషయమై ఇప్పటికే మత్స్యశాఖ కమిషనర్‌కు లేఖ రాశామని జిల్లా జాయింట్‌ డైరెక్టర్‌ పి.లక్ష్మణరావు తెలిపారు.

ఐదు రోజుల నుంచి డీజిల్ సరఫరా బంద్  : 
పశ్చిమాషియా ఉద్రిక్తతల నేపధ్యంలో ఇంధన సరఫరాకు ఆటంకం కలిగిన కారణంగా మత్యకారుల బోట్లు హర్బర్లకే పరిమితమవుతున్నాయి. ఈ సమస్య కారణంగా సుమారు ఐదారు రోజులుగా విశాఖ హర్బర్ లోనే బోట్లు నిలిచిపోయాయి. ఇక్కడ హర్బర్ లో బోట్లు నడవాలంటే లక్ష లీటర్ల డీజిల్ అవసరం ఉందని అంచానా. కానీ మత్యకారులు డీజిల్ అంటూ మోరపెట్టుకున్నా.. ప్రభుత్వం డీజిల్ సరఫరా చెయ్యడంలో ప్రభుత్వం విఫలమైందని మత్యకారులు విమర్శిస్తున్నారు.  వెంటనే పెంచిన డీజిల్ ధరను తగ్గించి.. డీజిల్ ను సరఫరా చెయ్యాలని మత్యకారులు  డిమాండ్ చేస్తున్నారు. 

30 వేల మంది మత్యకారుల ఉపాధికి గండి... : 
విశాఖ హర్బర్ ను నమ్ముకుని దాదాపు 30 వేల మంది మత్యకారులు ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు డీజిల్ సరఫఱా కాకపోవడంతో 30 వేల మంది మత్యకారుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది.  ఫలితంగా వేల మంది మత్యకారుల ఉపాధికి గండి పడటం వల్ల ఇదే వృతిని నమ్ముకున్న మత్యకారులు ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలంటున్న మత్స్యకారులు కోరుతున్నారు. 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!