* పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంతో చమురు రవాణాపై ప్రభావం..
*పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంచిన నయారా పెట్రోలియం సంస్థ..
* దేశ ప్రజల్లో మొదలైన అలజడి....
Petrol, diesel rates hiked by nayara enrgy :
పెట్రోలు ధరలను పెంచుతూ ప్రయివేటు రంగ చమురు సంస్థ నయారా ఎనర్జీ నిర్ణయం తీసుకుంది. ప్రయివేటు రంగ సంస్థ అయిన నయారా ఎనర్జీ పెట్రోల్ తో పాటు డీజిల్ ధరలను పెంచింది. లీటరు పెట్రోల్ పై రూ.5లు పెంచింది. లీటర్ డీజిల్ పై రూ.3 లు పెంచుతున్నట్లు నయారా ఎనర్జీ సంస్థ ప్రకటించింది.
ఇంధన కొరత ప్రభావం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు సతమతమవుతున్నాయి. పాకిస్థాన్, నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో ఇంధన కొరత కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. తాజాగా భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న సంఘర్షణ నేపథ్యంలో శుక్రవారం దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. కంపెనీ పెట్రోల్ ధరను లీటరుకు రూ.5.30, డీజిల్ ధరను లీటరుకు రూ. 3 పెంచింది. కాగా.. నయారా ఏడారికి 20 మిలియన్ టన్నుల సామర్థ్యంతో భారతదేశపు రెండవ అతిపెద్ద సింగిల్-సైట్ రిఫైనరీ అయిన నడినార్ అల్ రిఫైనరీని నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 6,500కు పైగా పెట్రోల్ పంపులను కలిగి ఉంది. గతేడాది 450,000 టన్నుల పాలీప్రొపీలిస్ ప్లాంట్తో పెట్రోకెమికల్స్ రంగంలోకి ప్రవేశించింది. నయారా ఎనర్జీని గతంలో ఎస్పార్ ఆయిల్ అని పిలిచేవారు. 2017లో రష్యాకు చెందిన రోస్నెస్ట్, ట్రాఫిగురా, యూసీపీ ఇన్సెస్ట్మెంట్ గ్రూప్ కన్నాన్జీయం కలిసి ఎస్పార్ అయిలు 12.9 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాయి. ఆ తర్వాత ఆ సంస్థకు నయారా ఎనర్జీ అని పేరు మార్చారు.
మరోవైపు.. ఐరావ్ యుద్ధం కారణంగా అక్కడి నుంచి వచ్చే ముడి చమురు నెల రోజులుగా అందడం లేదు. గల్ఫ్ దేశాల నుంచి ముడి చమురు రవాణాకు అంతరాయం కలగడంతో దేశానికి ముడి చమురు సరఫరా నిలిచిపోయింది. అయినప్పటికీ దేశంలో రష్మా వంటి దేశాల నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తుండటంతో పెట్రోల్, డీజిల్ కొరత పెద్దగా కనిపించలేదు. దేశంలో తగినంత నిల్వలు ఉన్నందున ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం నిరంతరం చెబుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదలతో చమురు కంపెనీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని వారాల క్రితం బ్యారెలు 90 డాలర్లకు లభించిన ముడి చమురు, ఇప్పుడు బ్యారెలు 160 డాలర్లకు చేరింది. ఈ నేపథ్యంలోనే గత వారం ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రీమియం పెట్రోల్ ధరలను రూ.2 వరకు పెంచాయి.. సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. కానీ.. తాజాగా భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ పెట్రోల్, డీజిల్ విక్రయ సంస్థ అయిన సయారా ఎనర్జీ రేట్లు పెంచడంతో జనాలు ఆందోళన చెందుతున్నారు.