Monday, 30 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోడి దిగ్భ్రాంతి... మృతులు కుటుంబాలకు కేంద్రం ఎక్స్ గ్రేషియో...

26 Mar 2026
02:07 PM
5

న్యూఢిల్లీ   : 

ఏపి లోని మార్కాపురం జిల్లాలో చోటుచేసుకున్న బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో ప్రయాణికులు సజీవదహనం కావడం అత్యంత విషాదకరమని అయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.  గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పన నష్టపరిహారం చెల్లిస్తామన్నారు.

ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మార్మాపురం జిల్లా రాయవరం సమీపంలోని పలకల క్వారీ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధం కాగా 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా.. 10. మంది ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

ప్రమాదానికి గురైన బస్సు నిర్మల్ నుంచి పామూరు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల హాహాకారాలు, ఆక్రందనలు, మంటలతో ఘటన స్థలం భీతావాహంగా మారింది..

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!