Monday, 30 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

నాకు న్యాయం చెయ్యకపోతే జనసేన కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకుంటా ... !

27 Mar 2026
08:20 PM
15

* రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ సంచలన ప్రకటన ..
* మరో సెల్ఫీ వీడియో విడుదల చేసిన మహిళా ఉద్యోగి హర్ష వీణ...
 
తిరుపతి   : 

తిరుపతి జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీథర్ ఎపిసోడ్ ఇంకా కొనసాగుతుంది. తనకు న్యాయం జరగకపోతే జనసేన కార్యాలయం ఎదుట పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ బాధితరులు హర్షవీణ సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం ఈ విషయమై మరో సెల్పీ వీడియో విడుదల చేసింది హర్ష వీణ. తాను ఎమ్మెల్యే చేతిలో మోసపోయి... అన్యాయం చేసిన మహిళలకు న్యాయం జరుగుతుందని బయటకు వస్తే అటు జన సేన పార్టీ, ఇటు ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శించారు. నేను ఫేమ్ కావడానికి ఇదంతా చేయలేదని, మహిళల పట్ల ఎంతో గౌరవం, వారి సమస్యల పట్ల కచ్చితంగా  పవన్ కల్యాణ్ చర్యలు తీసుకుంటారని నమ్మకంతో బయటకు వచ్చానంది. నేను చేసిన ఆరోపణల్లో నిజం లేకపోతే.. అదే బయట పెట్టాలని, తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమేనన్నారు.  నేను చేసిన ఆరోపణలను నిగ్గు తేల్చడానికి త్రిసభ్య కమిటీ వేసినప్పుడే నేను సగం సక్సెస్ అయ్యాను, కానీ ఎలాంటి రిపోర్ట్ ఇవ్వకుండానే ఎమ్మెల్యే తిరిగి మళ్లీ జనంలో తిరుగుతున్నాడనంది. ఈ వ్యవహారం తేలేవరకు పార్టీ కార్యక్రమాల్లో వద్దన్న పవన్ కళ్యాణ్....అరవ శ్రీథర్ ఇప్పుడు ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతున్నారని,  ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెబుతారని ప్రశ్నించారు.  పవర్ ఉందని మీరు ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. పార్టీకి సంబంధం లేదని చెప్పినా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే నేను పవన్ కళ్యాణ్ ని కాక మరెవరిని అడగాలని, పవన్ కళ్యాణ్ ఉన్నారనే ధైర్యంతో మీ పార్టీ ఎమ్మెల్యే పై చర్య తీసుకున్నారని బయటకు వచ్చానని ఆవేదన వ్యక్తం చేసింది. మీరంతా కలిసి అన్యాయం చేయాలనుకుంటే ఇక నాకు ఆత్మహత్యే శరణ్యమని, నేను చచ్చాక ఐనా సరే వీణాకు ఏమైనా చేయాలని అంటారేమోనని పేర్కొంది. ఎదిఎమైనా న్యాయం జరుగుతుందని తాను బయటకు వచ్చానని, కానీ ఇప్పుడు నాకు న్యాయం జరగక పోతే జనసేన పార్టీ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటా స్పష్టం చేసింది. 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!