Monday, 30 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

ప్రజలు జగన్‌కు చూపించిన బ్లాక్బస్టర్ సినిమా సరిపోలేదేమో... !

28 Mar 2026
02:20 PM
27

* అమరావతి తీర్మానాన్ని రాష్ట్ర ప్రజలంతా హర్షిస్తున్నారు ..
* వైసీపీలో సజ్జల ఎవరు.. ?  
* మీడియా  చిట్‌చాట్‌లో మంత్రి లోకేష్ ..


అమరావతి, మార్చి 28  : 

ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తే వైసీపీ  సభ్యులు హాజరుకాలేదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేల చిత్తశుద్ధి ఏంటో వారి వైఖరితోనే తెలుస్తోందని విమర్శించారు. "పాదయాత్రతో చంద్రబాబుకు సినిమా చూపిస్తా అని జగన్ అంటున్నారు. ప్రజలు జగన్కు చూపించిన బ్లాక్బస్టర్ సినిమా సరిపోలేదేమో. జగన్ చూపిస్తానంటున్న సినిమా 11 రోజులు కూడా ఆడదు. అమరావతి తీర్మానాన్ని రాష్ట్ర ప్రజలంతా హర్షిస్తున్నారు. మరోసారి తుగ్లక్ చర్యలు చూసేందుకు సిద్ధంగా లేరు. అమరావతికి చట్టబద్ధత తీర్మానాన్ని ఏప్రిల్ 2న పార్లమెంట్లో పెట్టే అవకాశం ఉంది.  దీనిపై అక్కడైనా వైసీపీ తన వైఖరి చెబుతుందో లేదో?" అని లోకేశ్ అన్నారు.


 వైసీపీలో సజ్జల ఎవరు.. ?  ... : 
వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మంత్రి మాట్లాడుతూ.. సజ్జల జ్ఞానం ఎంతవరకు ఉందో అందరికీ తెలుసని.. వైసీపీలో సజ్జల ఎవరు అని ప్రశ్నించారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించాలని ఈ రోజు ఏపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ రోజు రాత్రికి అసెంబ్లీ తీర్మానం ఢిల్లీకి వెళ్తుందన్నారు. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఈ బిల్లు పెడతారని భావిస్తున్నట్లు చెప్పారు.


ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర కేబినెట్‌లో ఈ బిల్లును ఆమోదించే అవకాశం ఉందని.. ఏప్రిల్ 2వ తేదీన పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి తెలిపారు. పార్లమెంట్‌లో వైసీపీ వాళ్లు ఏం చేస్తారో చూడాలన్నారు మంత్రి. అసెంబ్లీలోనే బిల్లు(తీర్మానం)కు వాళ్లు రావాల్సి ఉందని.. వాళ్లు రాకపోవడం అనేది అమరావతిపై వైసీపీకి ఎంత శ్రద్ధ ఉందో తెలుస్తుందన్నారు. అసెంబ్లీ జరుగుతుంటే సెక్యూరిటీ ఎంత ఉందో మీరే చూడండి. బ్లూ బుక్ ప్రకారం అందరూ ప్రోటోకాల్ ఇవ్వాల్సిందే. పాదయాత్రలో చంద్రబాబుకు సినిమా చూపిస్తామని జగన్ అన్నారు. ఆయన సినిమా ఏమిటో అందరికీ తెలుసు. ఆ సినిమా ఎలా ఆడిందో ప్రజలందరికీ తెలుసు. వైసీపీలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్లు అసెంబ్లీకి రావడం లేదు. మేము మాత్రం 11 గంటలకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడుతున్నాము. 11 గంటలకు ముహూర్తం చూసి మరి పెట్టాము’ అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!