Monday, 30 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

అందరి మద్దతుతోనే రాజధానిగా అమరావతి... !

28 Mar 2026
03:31 PM
69

* అందరి మద్దతుతోనే రాజధానిగా  అమరావతి... !
* అమరావతిని కాపాడుకునేందుకు నేటి చట్టబద్దత తీర్మానం చాలా అవసరం... 
* ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ మూడు ముక్కలాట ఆడింది ....
* అసెంబ్లీలో కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ....

అమరావతి డెస్క్   : 

ఏపి సిఎం చంద్రబాబు ఎంతో ముందుచూపుతో..అయనుకున్న అపార అనుభవంతో  రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేశారని, అమరావతిని అందరి ఆమోదంతోనే రాజధానిగా ఏర్పాటు చెయ్యడం జరిగిందని కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి అన్నారు. అమరావతికి చట్టబద్దత కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో అమె మాట్లాడుతూ 
2014వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడిన పరిస్థితిలో నూతనంగా ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా అనేక అధ్యయనాలు ..మేధావుల సలహాలతో  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆనాటి మన అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రతిపాదించారని, ఈ మేరకు నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి దానికి ఆమోదం తెలియజేశారన్నారు. అంతేకాకుండా  రాజధాని కృష్ణా నది ఒడ్డునున్న అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడం పట్ల రాష్ట్రంలోని అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల నుంచి సంపూర్ణ మద్దతు లభించిందని, 2015 అక్టోబర్ 22న దసరా పండుగ నాడు కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో నాలుగు అంశాల ప్రాతిపదికగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు యువత భవిష్యత్తు భావితరాల అవసరాలు ఆధునిక సాంకేతిక ప్రాతిపదికన దేశ ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో యావన్మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మద్దతుతో మన ప్రజా రాజధాని అమరావతికి అంగరంగ వైభవంగా అంకురార్పణ చేయడం జరిగిందన్నారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో తెలిపిన చరిత్ర కలిగిన సమర్థవంతులైన నిజమైన లీడర్  నారా చంద్రబాబు నాయుడని, ఆ నమ్మకంతోనే  30 వేల మంది రైతులు దాదాపు 34,000 ఎకరాలు ల్యాండ్ పోలింగ్ ద్వారా ప్రభుత్వానికి అప్పజెప్పడం జరిగిందన్నారు. అదే సమయంలో సంపూర్ణ మద్దతు ఇచ్చిన జగన్  2019 సార్వత్రిక ఎన్నికల్లో తన మనసులో ఉన్న మూడుముక్కలాట గురించి గానీ రాజధాని మీద  తనకున్న అభిప్రాయాన్ని చెప్పకుండా ఒక్క ఛాన్స్ అంటూ మాటలు చెప్పారని విమర్శించారు. అబద్దాలు చెప్పి ప్రజా పాదయాత్రలు చేసి అధికారంలోకి రాగానే ఆట అన్నిటిని అబద్ధం మాటలు మోసం మాటలుగా నిర్ణయం చేసుకుంటూ ఒక డిక్టేటర్ లాగా నియంతలాగా ఏ విధమైన అధ్యాయాలు అధ్యయనాలు కమిటీలు చర్చలు లేకుండా తన మాటే వేదంలా ప్రజల ఆశలను అడియాసలు చేశారన్నారు.  అమరావతి రద్దు మూడు రాజధానుల పేరిట ఆట మొదలుపెట్టి మూడు ముక్కలాట మొదలుపెట్టి పైసాచిక ఆనందంతో ప్రజలను మోసం చేశారన్నారు. ఈ విషయాన్ని ప్రజలు చరిత్రలో మర్చిపోలేరని, వైసీపీ మోసం వల్ల  30 ఏళ్ల వెనక్కి రాజధాని అభివృద్ధిని తోచేసారని,  ప్రజావేదిక కూల్చడం ద్వారా రాజధాని అమ రావతి విధ్వంసం ద్వారా జగన్మోహన్ రెడ్డి  యుద్ధ సన్నివేశాన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదన్నారు.  ప్రజాస్వామ్యం ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షల్ని, యువత యొక్క భవిష్యత్తుని వారి ఉపాధి అవకాశాలు తెలుపుతూ పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.  భవిష్యత్తులో మళ్లీ అవకాశం ఇస్తే  విధ్వంసం చేసి ఒక రాష్ట్రాన్ని ఎలా నష్టపరుస్తారో వైసీపీ చూపిందన్నారు. రాయలసీమ ఉత్తరాంధ్రకు ఏమి చేయలేక రెండిటికీ చెడ్డ రేవడిలా చేశారని, ఎన్నో ఆశలు పెట్టుకుని 150 స్థానాల్లో అవకాశం ఇస్తే... సద్వినియోగం చేసుకుంటే మళ్ళి మళ్ళి అవకాశం ఇచ్చేవారని, కానీ దుర్వినియోగం చేసుకుంటే 11 నెంబర్‌ను ఇచ్చారని, ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా ఇచ్చరన్నారు. అమరావతి రైతులు 631 రోజులు దీక్ష చేశారని,  మంత్రి అచ్చన్న భావోద్వేగంతో ఆ రోజు జరిగిన పరిస్థితులను తెలియజేశారని,  ఇది ఆ రోజు గెలిచిన ప్రజా ప్రతినిధుల భావోద్వేగం మాత్రమే కాదని రాష్ర్ట ప్రజల భావోద్వేగమన్నారు.   రాష్ట్రాన్ని నాశనం చేసిన విధానాన్ని అయన కళ్లకు కట్టినట్టు తెలియజేశారన్నారు.  

అమరావతి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఐదు కోట్ల ప్రజల ఆత్మ గౌరవ ప్రతీకని,   అధికారం కోల్పోయాక పగబట్టిన పాములా పదే పదే విషయం చల్లుతున్నారని,  నేషనల్ మీడియా ముందుకు వచ్చి అమరావతి నది గర్భంలో నిర్మిస్తున్నారని  అసత్య కథనాలు వడ్డీ వారిస్తూ రాజధాని మీద అబద్ధాలు రాస్తున్నారన్నారు.  అంతేకాకుండా  ఆర్థిక సాయం ఇవ్వని ఇవ్వబద్దని ప్రపంచ బ్యాంకు సంస్థలకు లేఖలు రాస్తున్నారని విమర్శించారు. రాజధాని రైతులకు నిబంధనలకు లోబడి ప్లాట్లు కేటాయిస్తుంటే వైసీపీ సోషల్ మీడియాలో అసత్య పోస్టులు పెట్టి రైతులను ఆందోళనకు గేని చేస్తున్నారన్నారు. అమరావతి మహిళలపై మాట్లాడడమే కాకుండా ఇప్పటికీ సాక్షిలో డిబేట్స్  పెడుతూ రాజధాని రైతులను,మహిళలు అవమానిస్తున్నారన్నారు. ఇప్పటికీ ఏదో ఒక అగ్నిప్రమాదం జరుగుతూనే ఉంది  తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అంతేకానీ ఇక్కడ కట్టిన సచివాిలయం, అసెంబ్లీ, హైకోర్టు, స్టార్ హోటల్స్, క్వాంమ్ వ్యాలీ, బిట్స్ పిలానీ, రాజధాని లే అవుట్, ఫోరెన్సిక్ యూనివర్శిటి, జాతీయ బ్యాంకుల శంకుస్థాపన, ప్రపంచ స్థాయి గ్రంధాలయాలు, జాతీయ అంతర్జాతీయ విద్య సంస్థల ఏర్పాటు  వైసీపీకి కనిపించడం లేదని, అందుకే వీటిని పేక మేడలని విమర్శిస్తున్నారన్నారు. మరోమారు అమరావతి భవిష్యత్తును నాశనం చెయ్యడకుండా ఉండాలంటే    ఇలాంటి తీర్మానం చేసుకుని చట్టబద్దత  తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉందని, ఈ తీర్మానానికి తన సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని చెప్పారు. 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!