Sunday, 29 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

సుప్రీంకోర్టుకైనా " రాజ్యాంగమే" సుప్రీం ...!

28 Mar 2026
06:07 PM
55

* క్రిష్టియన్స్  ముద్ర వేసి దళిత వర్గాలను అణచివేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర...
* స్వేచ్ఛ, రక్షణ లేకుంటే చర్చిలకు వెళ్లకా ఎమీ చేస్తారు ?
* ఇఫ్తార్ విందుకు వెళ్లి ముస్లింల టోపీ ధరించిన చంద్రబాబుకు....
*చర్చికి వెళ్లిన పవన్, ప్రధాని నరేంద్రమోడిలకు కులం, మతం మార్చుతారా ? 
 

కడప   :  
భిన్నత్వంలో ఏకత్వం కలిగిన అతి పెద్ద భారత దేశంలో దళిత, క్రైస్తవ కులాలకు చెందిన వారిని అణగద్రొక్కే ప్రయత్నం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని వైసీపీ రాష్ర్ట సంయుక్త కార్యదర్శి కిషోర్ బూసిపాటి విమర్శించారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వైద్యవిభాగం సభ్యులు డాక్టర్ పెంచలయ్యతో కలిసి మాట్లాడుతూ  ఇటీవల సుప్రీం కోర్టు చర్చిలకు వెళ్లే వారందరికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం వర్తించదని , ఎస్సీ కులాలకు సంబంధించిన పథకాలు కానీ వర్తించని చెప్పడం జరిగిందన్నారు.  2015లో కూడా ఇలానే తీర్పు వచ్చిందని, కానీ ఎవరైనా రాజ్యాంగానికి కట్టుబడి వ్యవహరించాల్సి అవసరం ఉందని, సుప్రీంకోర్టుకైనా " రాజ్యాంగమే" సుప్రీం అన్నది గుర్తించుకోవాలన్నారు. ప్రస్తుతం దేశంలో విశ్వహిందుపరిషత్, అర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ వంటి సంస్థల సూచనతో దేశంలో పాలన సాగుతుందన్నారు. దళితులను అంటరాని వారిగా ఏ విధంగా గుర్తించాలని ప్రయత్నంలో భాగంగా అణచివేసే కుట్ర జరుగుతుందన్నారు. దేశంలో అమిత్ షా రాజ్యాంగం నడిపించడంలో భాగంగానే ఈ అణచివేసే దుర్మార్గమైన విధానంతో ముందుకు వెళ్తున్నారన్నారు. చర్చిలకు పోయినంత మాత్రాన కులాల ఎలా మారతాయని, ఎస్సీలుగా పుట్టి, ఎస్సీలుగా చనిపోయే దళిత వర్గాలను అణచివేసే కుట్రలో భాగంగా ఇలాంటి తీర్పులు వస్తున్నాయన్నరు. మత స్వేచ్చ లేని పరిస్ధితిల్లో దేవుడు, గుడి కావాలనే  తపనతో దళిత వర్గాలు ఉన్నా...నేటికి గర్భగుడిలోకి ప్రవేశం లేని దయనీయ పరిస్ధితన్నారు. దళితుల పెళ్లిళ్లకు పూజారులు రారని, చావులకు పూజారులు రానీ పరిస్ధితి కొనసాగుతుందని,  దళిత వర్గాలు నేటికి ఆలయాలకు, గర్బగుడిలోకి వెళ్లలేని పరిస్ధితి ఉందన్నారు. ఆలయాలకు వెళ్లలేక  భక్తితో దేవున్ని ప్రార్థించాలంటే  దిక్కుతోచని పరిస్ధితుల్లోనే చర్చిలకు వెళ్తున్నారన్నారు. కానీ ఇలా చర్చిలకు వెళ్లడం ఓర్చుకోలేని కూటమి పార్టీల పాలకులు కోర్టుల ద్వారా ఇలాంటి తీర్పులు ఇప్పిస్తున్నారన్నారు. ఇటీవల రంజాన్ సందర్బంగా చంద్రబాబునాయుడు మసీదుకు వెళ్లారని, డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ తన భార్య క్రిస్టియన్ అని చర్చి వెళ్లాడని, నరేంద్రమోడి క్రిస్మస్ సందర్బంగా చర్చికి వెళ్లారని, మరి వీరందరికి కులం మార్చి మతం మార్చుతారా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం అన్ని మతాలు, అన్ని కులాలకు చెందిన వారిలో నాటకాలాడటం పరిపాటిగా మారిందని, రాజకీయ నాయకులు చేస్తే సరైంది, నిజంగా దేవుని కోసం చేస్తే కులాలు మతాలు మార్చుతారా అంటూ మండిపడ్డారు. అర్టికల్ 25 ప్రకారం ఎవరెవరి విశ్వాసాల ప్రకారం వారి వారి దేవుళ్లను పూజించుకోవచ్చునని రాజ్యాంలో రాయబడి ఉందని, ఇది ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలన్నారు. కానీ నేడు అధికారంలో ఉన్న పార్టీలు రాజ్యాంగాన్ని పక్కనబెట్టి  దళిత వర్గాలను అణచడమే ధ్యేయంగా కుట్రపన్నుతున్నాయన్నారు. ఇలాంటి విషయంలో అందరికి రాజ్యాంగం సుప్రీమని, కోర్టులు కూడా రాజ్యాంగానికి లోబడే తీర్పులు ఇవ్వాలని హితవు పలికారు. రాజకీయాల కోసం, దళితులను అణచివేయడం కోసం డిప్యూటి స్పీకర్ రఘురామకృష్ణారాజు లాంటి వారు దళితుల్లో చిచ్చు పెట్టడం కరెక్ట్ కాదన్నారు. దళితులు ఇప్పటికైనా మేల్కొని ఇలాంటి తీర్పులపై, పార్టీలపై దిరగబడాలని పిలుపునిచ్చారు. దళితులకు, క్రిస్టియన్స్ కు ఎప్పటికైనా  వైసీపీ ఆండగా  ఉంటుందన్నారు. 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!