విభజన సమయంలో వైఎస్ జగన్ నిజంగా తప్పించుకు తిరిగారా .. ?
* అసెంబ్లీలో చంద్రబాబుపై ప్రసంగంపై విస్తృత చర్చ ...
* పార్లమెంట్ లో వైఎస్ జగన్ ప్లకార్డ్ చేతబట్టి ఆందోళన చేస్తున్న వీడియోలు వైరల్ ..
* దాక్కుంది ఎవరంటూ వైసీపీ ప్రశ్నలు ...?
Astra desk :
రాష్ట్ర విభజన సమయంలో (2014) వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎక్కడున్నారు. నిజంగా ఎక్కడున్నారో తెలియకుండా... కెమెరాలకు కూడా కినిపించకుండా దాక్కున్నారా ? కనీసం విభజనపై ఒక స్టాండ్ చెప్పడానికి భయపడ్డారా? అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగం అనంతరం ఇప్పుడు ఏపి రాజకీయాల్లోనే కాదు... ప్రతి ఒక్కరిలో ఇదే చర్చ. కానీ ఆనాడు జరిగిన పరిణామాలన్ని అందరు చూశారు. వైఎస్ జగన్ ఎక్కడున్నారో... ఎమి చేశారో ...అన్ని మీడియాల్లో ప్రధానంగా చూపాయి. కానీ అందరికి గుర్తుకు ఉన్నా... చంద్రబాబుకు గుర్తుకు లేదా ? అన్నది ఇప్పుడు అసలు చర్చ. ఇంతకీ విభజన సమయంలో జగన్ ఎక్కడున్నారు...విభజన తరువాత ఏం చేశారో ఒక సారి చూస్తే ...
విభజన సమయంలో జగన్ ఎక్కడున్నారు...అయన పాత్ర :
రాష్ట్ర విభజన సమయంలో (2014) వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హైదరాబాద్‌లోనే ఉంటూ సమైక్యాంధ్ర కోసం పోరాడారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆయన ఆ సమయంలో తన ఎంపీ పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి నిరసనగా ఆందోళనలు చేపట్టారు. రాష్ట్రం విడిపోకూడదని, తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలని కోరుతూ సమైక్యాంధ్ర ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకత్వం వహించారు. విభజన బిల్లును వ్యతిరేకిస్తూ హైదరాబాద్‌లో, అనంతరం రాష్ట్ర విభజనను నిరసిస్తూ చంచల్‌గూడ జైలులో, ఆ తర్వాత విడుదలయ్యాక కూడా ఆయన నిరాహార దీక్షలు చేపట్టారు.పార్లమెంట్ లోను, ఆవరణలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర విభజన అంశంపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, పార్లమెంట్ ఆవరణలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా రాష్ట్ర విభజన చేస్తోందని ఆరోపిస్తూ, తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం 'సమైక్యాంధ్ర' నినాదంతో పోరాడారు. విభజనను వ్యతిరేకిస్తూ ఆయన నిరాహార దీక్షలు, సభలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ తీరును నిరసించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ, విభజన వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. అడ్డగోలుగా విభజన జరుగుతోందని, ప్రాంతాల మధ్య ఘర్షణలు వస్తాయని ఆయన ముందుగానే హెచ్చరించారు. ఈ ఉద్యమాలు, ఆందోళనల సమయంలో వైఎస్ జగన్ కేంద్రంగానే మీడియాలో వార్తలు, కథనాలు ప్రచురితమయ్యాయి. ప్రసారమయ్యాయి. దాదాపుగా పార్టీ తరుపున జగనే ప్రముఖంగా కనిపించారు.
కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్రంలో జై సమైక్యాంద్ర అంటూంటే... అదిష్టానం మాత్రం రాష్ట్ర విభజనకే మొగ్గు చూపింది. బిజేపి కూడా కాంగ్రెస్ అడ్డగోలుగా విభజిస్తుందని విమర్శిస్తూనే విభజనకు మొగ్గు చూపింది. అప్పుడు బిజేపి తరుపున ఒక్క అప్పటి మాజీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాత్రమే మాట్లాడుతూ వచ్చారు. చివరకు రాజ్యసభలో డోర్లు మూసి అడ్డగోలుగా విభజించారు.

విభజన తరువాత వైఎస్ జగన్ ఏం చేశారు... :
విభజన హామీల్లో భాగంగా కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించింది. కానీ హోదా అమలు సాధ్యం కాలేదు. దీంతో చంద్రబాబు సర్కారు ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ వైపు మొగ్గు చూపింది. కానీ జగన్ మాత్రం.. ప్యాకేజీ వద్దంటూ ప్రత్యేక హోదా కోసం పోరాటాన్ని కొనసాగించారు. రాష్ట్రానికి హోదా ప్రకటించాలంటూ.. నిరాహార దీక్షకు దిగారు. నిరసన కార్యక్రమాలు.. ఢిల్లీలో ధర్నాలతో హోరెత్తించారు. రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించి హోదా నినాదాన్ని వినిపించారు. జగన్ పాదయాత్ర సమయంలో ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలతో రాజీనామా చేయించారు. తర్వాత పార్టీ ఎంపీలు ఢిల్లీ వేదికగా నిరాహార దీక్షకు దిగారు. కేంద్రం హోదా ప్రకటించడం కుదరదని తేల్చడంతో.. రాష్ట్రవ్యాప్తంగా బంద్‌లు, ధర్నాలు, నిరసనలతో హోరెత్తించారు. పాదయాత్ర చేస్తూనే జగన్ కూడా హోదా పోరాటంలో భాగస్వామ్యులయ్యారు. పాదయాత్ర ముగిసిన వెంటనే జగన్ సమర శంఖారావం, అన్న పిలుపు పేరుతో పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తటస్థులతో జగన్ సమావేశమై విభజన హామీలపై ఉద్యమాలును కొనసాగించారు.
చంద్రబాబు ఏం చేశారు... :
కానీ విభజన సమయంలో చంద్రబాబు తీరే పలు విమర్శలకు దారితీసింది. అయన మాత్రం ఎక్కడా ఆందోళనలు, ధర్నాలు, నిరసనల్లో కనిపించలేదు. విభజన సమయంలో సమన్యాయం చెయ్యమనే ఒకే ఒక్క డిమాండ్ చేస్తూ అప్పుడప్పుడు మీడియాలో కనిపించే వారు. టిడిపి ఎంపీలు కూడా పార్లమెంట్ లో సమన్యాం చెయ్యాలనే పోరాడారు. ఒక్క టిడిపి ఎంపి హరికృష్ణ ఒక్కరే తాంబుళాలు ఇచ్చాము..తన్నుకు చావండి అన్నట్లు రాష్ట్రాన్ని విడగొడతారా అంటూ ఎంపి పదవికి రాజీనామా చేశారు. ఇక ఇతర ఎంపీలుందరు రోజు సమన్యాయం పేరుతో ఆందోళనలు కొనసాగిస్తూ వచ్చారు. వాస్తవానికి తెలుగు జాతి అంటూ తెరమీదకు వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ప్రశ్నించాల్సింది పోయి సమన్యాయం అంటూ ఎలా మాట్లాడతారన్న ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. మరో వైపు తెలంగాణా ప్రాంత టిడిపి ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రం అంతకుముందు టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న సందర్బంలో తెలంగాణాకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చారని చెబుతూ ప్రచారం చేస్తూ వచ్చారు. అంతకుమించి చంద్రబాబు పెద్దగా ఎక్కడా ఆందోళనలు, నిరసనలతో కేంద్రాన్ని నిలదీసిన సందర్బాలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతొంది. కానీ జగన్ సమైక్యాంధ్ర ఆందోళనతో ఎక్కువగా ఇరకాటంలో పడిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. తొలుత విభజనను అంగీకరించి, సీమాంధ్రకు ప్యాకేజీల గురించి మాట్లాడిన చంద్రబాబు క్రమంగా రాష్ట్ర విభజనను వ్యతిరేకించే దశకు చేరుకున్నారు. అప్పుడు తెలుగుజాతి ఆత్మగౌరవం అంటూ దీక్ష చేపట్టారు. కానీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

కానీ ఇప్పుడు అమరావతికి చట్టబద్దత కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆనాడు పార్లమెంట్‌లో జగన్ కనిపించకుండా దాక్కున్నారని విమర్శించడం విమర్శలకు తావిస్తొంది. దీనిపై రేపటి నుంచి వైసీపీ కూడా చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టే అవకాశం లేకపోలేదు.