అబ్బా కొడుకుల డబ్బా కొట్టుకునేందుకే... ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ....!
* రాజధానిని చంద్రబాబు నిర్మించలేడు..!
* అందుకే చట్టబద్దత అంటూ కుటిల ఎత్తులు..
* అమరావతి నిర్మాణం పూర్తి చెయ్యలేమనే అనుమానంతోనే ఈ కుట్రలు..
* జగన్ తిట్టడానికే ఈ ప్రత్యేక సమావేశమా ?..
* రైతులకు ఎంత వరకు న్యాయం చేశారో చెప్పాలి .. ?
* కడపలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి, మాజీ డిప్యూటి సిఎం అంజాద్ బాష డిమాండ్...
కడప :
అమరావతికి చట్టబద్దత పేరుతో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశం కేవలం అబ్బా కొడుకుల డబ్బు కొట్టుకునేందుకు, రైతులను మసం చేసేందుకేనని కడప జిల్లా వైసీపీ అధ్యక్షులు రవీంద్రనాథరెడ్డి, మాజీ డిప్యూటి సిఎం అంజాద్ బాషలు విమర్శించారు. కడపలో మీడియాతో మాట్లాడిన వారు ఏపి రాజధాని అమరావతిని చంద్రబాబు నిర్మించలేడని, అందుకే చట్టబద్దత అంటూ ఈ కుటీల ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి నిర్మాణం పేరుతో ఇప్పటికే చంద్రబాబునాయుడు రూ.52 కోట్లకు సంబంధించి టెండర్లు పిలవడం జరిగిందని, ఇందుకోసం రూ. 47 వేల కోట్ల అప్పులు తీసుకువచ్చారన్నారు. ఇందులో 10 శాతం మెబిలైజేషన్ బినామీ కాంట్రాక్టర్లకు ఇచ్చారని, అప్పులు తెచ్చి మరి రూ. 5 వేల కోట్లు కట్టబెట్టారని, ఇవన్నీ చేశాకా ప్రత్యేక సమావేశం ఎందుకని ప్రశ్నించారు. ఈ ప్రత్యేక సమావేశం కేవలం అక్కడి రైతును మోసం చేసేందుకేనని, అక్కడ భూములు తీసుకుని అభివృద్ది చెయ్యకపోవడంతో వారిలో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. కొత్తగా 2వ విడతలో మళ్లీ 50 వేల ఎకరాలు తీసుకువాలనే ప్రయత్నం చేస్తున్నారని, ఆ భూసేకరణకు రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ఇలా చట్టబద్దత, ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పేరుతో సమయం, డబ్బు వృధా చేస్తున్నారన్నారు. అయినా అసెంబ్లీ ఒక్కటే తీర్మానం చెల్లదని చంద్రబాబుకు తెలుసుకునని, మండలిలోను అమోదం పొందాల్సిందేనన్నారు. ఇప్పటికే ఎన్నికల హామీలు అమలు చెయ్యలేక సూపర్ హిట్ సమావేశాలతో మోసం చేస్తున్నారని, ఇప్పడు అమరావతి ప్రాంత రైతులను మోసం చెయ్యడంలో ఇదొక భాగమన్నారు. అయినా ఇంత కాలం పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు అక్కడ ఏం అభివృద్ది చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటి వరకు తాత్కాలిక భవనాలు తప్పా చేసింది ఎమీ లేదని, కనీసం అయన కరకట్ట రోడ్డు వేసేకోలేకపోయారని ధ్వజమెత్తారు. ఈ కూటమి పాలన, చేసిన అభివృద్దిని చూసి ఏ ఒక్క రైతైనా సుఖసంతోషాలతో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు డైవర్షన్ పాలిటిక్స్ అలవాటేనని, అందులో భాగంగానే ఇప్పుడు అమరావతి ప్రాంత రైతుల వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు చట్టబద్దత అంటూ నాటకాలుడుతున్నారని విమర్శించారు. రాజధాని పేరుతో చంద్రబాబు చేసిన అప్పులు, వాటికి సంబంధించిన సమాచారం, ఎంత మందికి లబ్దిచేకూరిందన్న సమాచారం సమాచార హక్కు చట్టం కింద అడిగితే సమాధానం ఇవ్వడం లేదన్నారు. లక్షల కోట్లు ఓకే చోట పెట్టుబడి పెట్టాడాన్ని ప్రజలు గమనించాలని, మభ్యపెట్టే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టి రాజధాని నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. అమరావతి నిర్మాణాన్ని వైసీపీకి వ్యతిరేకం కాదని, కేవలం అమరావతి నిర్మాణం కట్టలేమనే అనుమానంతోనే చంద్రబాబు వైసీపీ వ్యతిరేకం అంటూ కుట్రలు పన్నుతున్నారన్నారు.
కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అమరావతిలో ఎందుకు రెండేళ్లైనా శాశ్వత నిర్మాణాలు చేపట్టలేదని, రైతుల ఇబ్బందులు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ఏమి మేలు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు చేస్తున్న పనులపై అమరావతి ప్రాంత వాసుల్లో సంతృప్తి ఉంటే, వారికి న్యాయం చేశామనే ధమ్ము మీలో ఉంటే మండలిలో ఎందుకు ఈ అంశంపై చర్చించలేదన్నారు. రెండేళ్లు ఏమి చేయలేకపోయిన చంద్రబాబు తిరిగి ఎన్నికల్లో ఇదే అంశాన్ని వాడుకునేందుకు ప్రయత్నం చేస్తారని, కానీ ప్రజలు చెంప మీద కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. కేవలం వైఎస్ జగన్ ను తిట్టేందుకు ఇలాంటి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చెయ్యడం మానుకుని ఇప్పటికైనా రాజధాని నిర్మాణంపై దృష్టి సారించాలని హితవు పలికారు.