* మ్యాచ్ ఫిక్సింగ్ ల వల్లే 25 యేళ్లుగా కడపలో టిడిపికి అవకాశం రాలేదు...
* పగలు ఒక కండువ...రాత్రి ఒక కండువ కప్పుకునే వారున్నారు..
* అందరి సమాచారం నా వద్ద ఉంది...
* నిజాయితీగా సమాజ సేవ చేస్తే...టిడిపికి తిరుగుండదు...
* జిల్లాలో మా కుటుంబం చేసిన త్యాగం .. ఏ ఇన్ చార్జి చెయ్యలేదు...
* నాయకులు, కార్యకర్తలకు కడప రెడ్డమ్మ మాస్ వార్నింగ్ ....
కడప :
కడప నియోజకవర్గంలోని టిడిపి కార్యకర్తల్లో నిజాయితీ పెరగాలని, ప్రజలకు సేవ చెయ్యడం అలవరచుకోవాలని, ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ లకు స్థానం లేదని కడప ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మాధవీరెడ్డి నాయకులకు, కార్యకర్తలకు వార్నింగ్ ఇస్తూ సంచలన కామెంట్స్ చేశారు. కడపలో పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని పురష్కరించుకుని అమె మాట్లాడుతూ కడపలో కార్యకర్తలు నిజాయితీగా ప్రజాసేన చేస్తే ఇక్కడ వైసీపీ కనుమరుగేనన్నారు. మాకు ఒక్క పైసా కూడా అవసరం లేదని, మీకు ఆర్ధికంగా ఏ అవసరం ఉన్నా మీ వాసు అన్న ఇచ్చైనా అండగా నిలబడతారన్నారు. కానీ కొంత మంది పగు ఒక పార్టీ కండువ, రాత్రి మరో పార్టీ కండువ కప్పకుంటున్నారని, ఎవరు ఎలాంటి వారూ తనకు అన్ని విషయాలు తెలుసునన్నారు. కాకపోతే వాసన్న ఉన్నాడు...మంచోడు అని వాళ్లు అనుకుంటుంటారని, కానీ నా వద్ద ప్రతి ఒక్కటి డైరీలో రికార్డు అవుతుంటాయన్నారు. తన వద్ద మ్యాచ్ ఫిక్సింగ్ పనికి రాదని, ఆ మ్యాచ్ ఫిక్సింగ్ ల వల్లే 25 యేళ్లుగా కడపలో మనకు అవకాశం రాలేదన్నారు. ఇప్పుడు అవకాశం వచ్చిందని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు నిజాయితీగా ప్రజాసేన చెయ్యాలన్నారు. ఇవన్నీ సజావుగా జరగాలంటే మన వెంట ఉంటూ మనల్ని చెడగొట్టే వారు ఉంటారని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. అలాంటి వారికి పనిపాట లేదని, మనల్ని చెడగొట్టడమే వారి పని అన్నారు.
కడప టిడిపిలో ఎవరు యాక్టీవో, ఎవరో నిజాయితీపనులో తన వద్ద సమాచారం ఉందన్నారు. 2013 నుంచి జిల్లా అధ్యక్షులుగా శ్రీనివాసులరెడ్డి పనిచేస్తున్నారని, అయనపై గత ప్రభుత్వ మాయంలో అంగళ్ల వద్ద జరిగిన ఘటనలో 307 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారన్నారు. వాస్తవానికి ఈ దాడి జరిగిన సమయంలో శ్రీనివాసులరెడ్డి ఢిల్లీలో ఉన్నారని, జిల్లాలో లేకపోయినా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారన్నారు. కానీ ఇప్పుడు తాము ఎవర్ని వదిలేది లేదని, తప్పు చేసిన వారిపై పర్ ఫెక్ట్ గా ఇప్పుడు కేసులు పెడతామని హెచ్చరించారు. కడపలో రెడ్డప్పగారి కుటుంబం ఎన్నో ఇబ్బందులు పడిందని, తాము టాక్స్ లు సజావుగా కడుతున్నా...మాపై దాడులు చేయించారని, అక్రమంగ కసుల్లో ఇరికించాలని చూశారన్నారు.
జిల్లాలో తమకంటే ఇబ్బందులు ఏ ఇన్ చార్జి పడలేదని, కొంత మంది త్యాగాలు చేశామని చెప్పుకుంటున్నారని, కానీ మాకంటే ఎక్కువ ఏ ఇన్ చార్జి త్యాగం చెయ్యలేదన్నారు. ఇక నుంచి ప్రజల అభిమానాన్ని చూరగోనేలా సమాజ సేవ చెయ్యాలన్నారు. కడపలో తాము ఎవ్వరికి బెదిరేది లేదని, ప్రజలకు సేవ చేస్తే కడప జిల్లాలో గెలిచి చూపిస్తామన్నారు. ఇక నుంచి ఎవ్వరు తిరుగు లేకుండా పని చెయ్యాలని సూచించారు.