Monday, 30 March 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

భర్త గ్యాస్ సిలిండర్ తీసుకురాలేదని ఫినాయిల్ తాగి మహిళ అత్మహత్యయత్నం...!

29 Mar 2026
10:05 PM
63

Astra desk  :

గుత్తి మండలం తొండపాడు గ్రామంలో ఆదివారం ఒక వింత ఘటన చోటుచేసుకుంది. భర్త గ్యాస్ సిలిండర్ తీసుకురాలేదన్న కోపంతో మహాలక్ష్మి అనే మహిళ ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా కూడా గ్యాస్ కష్టాలు వెంటాడటంతో గుత్తిలోను గత కొన్ని రోజులుగా గ్యాస్ పంపిణి సక్రమంగా జరగడం లేదు. దీంతో గత మూడు రోజులుగా భర్త హరికృష్ణ సిలిండర్ కోసం గుత్తికి వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి వస్తుండటంతో మనస్థాపానికి గురైన ఆమె ఈ అఘాయిత్యానికి ఒడిగట్టింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సమాచారం తెలుసుకున్న స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. గ్యాస్ సిలిండర్ కోసం ఆత్మహత్యయత్నం చెయ్యడం ఎంటని వింతగా స్పందిస్తున్నారు.

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!