Thursday, 28 May 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

టిడిపి మహనాడు నిర్వహణలో రాష్ర్ట స్థాయిలో సత్తా చాటిన ప్రొద్దుటూరు ...!

28 May 2026
07:50 PM
23

* మొదటి రోజు రాష్ర్ట స్థాయిలో 5వ స్థానం...
* రెండవ రోజు 8వ స్థానం....
*ఎమ్మెల్యే  వరదరాజు రెడ్డి, తనయుడు కొండారెడ్డిలకు అభినందనల వెల్లువ....
* భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు  ...


కడప  : 

తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు వర్చువల్ కార్యక్రమం లో కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గం సత్తా చాటింది. ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే నందాల వరదరాజు రెడ్డి, తనయుడు నంద్యాల కొండారెడ్డిల ఆధ్వర్యంలో మొత్తం నియోజకవర్గ పరిధిలో 12 క్లస్టర్ గా విభజించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలి రోజు నిర్వహించిన కార్యక్రమం ద్వారా ప్రొద్దుటూరు నియోజకవర్గం రాష్ర్ట స్థాయిలో 5వ స్థానంలో నిలవగా, రెండవ రోజు 8వ స్థానంలో నిలిచింది. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే పెద్దాయన నంద్యాల వరదరాజులరెడ్డి, అయన తనయుడు కొండారెడ్డిలు కలిసి ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతంగా నిర్వహించారు. నియోజకవర్గంలో నిర్వహించిన 12 క్లస్టర్లలోను పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేశారు. మొత్గంగా కడప జిల్లాలోను ఏ నియోజకవర్గంలోను కానరానీ విధంగా ప్రొద్దుటూరులో మంచి స్పందించిన కనిపించింది. ఈ కారణంగానే  మహానాడు వర్చువల్ కార్యక్రమం నిర్వహణలో తొలి రోజు  5వ స్థానంలో నిలవగా, రెండవ రోజు 8వ స్థానంలో నిలిచింది.

Article Image
ఈ సందర్బంగా పట్టణంలో ఏర్పాటు చేసిన 4వ క్లస్టర్ లో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి జండా ఆవిష్కరించి అనంతరం స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహానాడు వేదిక వద్ద ఏర్పాటుచేసిన వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి పరిశీలకులు భావన, పార్టీ సీనియర్ నేత సిఎం సురేష్ నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వీక్షించారు. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మాట్లాడుతూ పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ ఆశయాలను స్మరించుకుంటూ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ మహానాడు పండుగలు జరుపుకుంటామన్నారు. ఈ సందర్బంగా అయన పార్టీ సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపారు. 
 Article Image
రెండవ రోజు ప్రొద్దుటూరు  పట్టణంలోని 10వ క్లస్టలో  టిడిపి నాయకులు నాగేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు నంద్యాల కొండారెడ్డి, ప్రొద్దుటూర్ టిడిపి పరిశీలకులు భావన, నంద్యాల రాఘవరెడ్డి, బద్వేల్ శ్రీనివాసులు రెడ్డి, పల్లేటి చంద్రశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రసూల్ గౌస్, శ్రీకాంత్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే తనయుడు నంద్యాల కొండారెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు ను స్మరించుకుంటూ ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ మహానాడు పండుగలు జరుపుకుంటున్నామని, మహనాడు కార్యక్రమానికి ఇంతటి భారీ స్పందన రావడం శుభ పరిణామమన్నారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, యువనేత మంత్రి లోకేష్ , ఇతర ప్రముఖుల ప్రసంగాలు విని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన టిడిపి నాయకులు నాగేంద్ర మాట్లాడుతూ మహానాడు ప్రతిసారి సాధారణంగా మే 27, 28 తేదీల్లో జరుగుతుందని, మే 28 ఎన్టీఆర్ జయంతి జరుగుతుందని , ఈ రెండు సందర్బాలను పురష్కరించుకుని కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహిస్తామన్నారు. వేలాదిమంది కార్యకర్తల సమక్షంలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నామన్నారు.

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!