Saturday, 13 June 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

నీటి ఎద్దడి నివారణకు ...సరికొత్త ఐడియా ... ! దేశంలోనే తొలి ప్రాజెక్ట్ ... !!

07 Jun 2026
04:03 PM
167

* కడప జిల్లా  లింగాల మండలం గుణకనపల్లిలో సరికొత్త కృత్రిమ ఇన్ఫ్యూషన్ రీచార్జ్ బోర్ వెల్ ప్రాజెక్ట్ ఏర్పాటు...
* భూగర్భ జలాల పునరుద్ధరణ...  బోర్‌వెల్స్ రీఛార్జ్  ..
* రీఛార్జ్ చేసిన రెండు మూడు రోజుల్లోనే పెరిగిన భూగర్భ జలాలు ... 
* రీఛార్జ్ బోర్‌వెల్స్ ప్రాజెక్ట్ ప్రారంభించిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ...
* మాజీ సిఎం వైఎస్ జగన్ కు, అధికారులకు ధన్యవాదాలు తెలిపిన ఎంపి, ప్రజలు  ....

Astra desk  : 

ఒక్క ఐడియా.... ఆ గ్రామ నీటి ఎద్దడి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది. వేసవిలో నీటి ఎద్దడితో సతమతమయ్యే పరిస్ధితి నుంచి గట్టెక్కేలా చేసింది. ఇప్పుడు నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించుకుని తాగునీరే కాదు... భూగర్బ జలాలు అడుగంటి పోకపోవడంతో అరటి తోటలకు మోటార్ల ద్వారా నీరు పారించుకుని పంటలను కాపాడుకునే అవకాశం లభించడంతో గ్రామ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకి ఎదా గ్రామం. వారికొచ్చిన ఐడియా ఎంటీ.. మీరే చూడండి. 

Article Image
కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలోని గుణకనపల్లె ఒకప్పుడు తీవ్రమైన నీటి ఎద్దడితో అల్లాడిపోయేది. అరటి తోటల సాగు గుణకన్నపల్లె ప్రజల అధారం కాగా... ప్రతి యేటా నీటి ఎద్దడి సమస్యతో తాగునీరు... సాగునీటికి కటకట తప్పేది కాదు. అలాంటిది గత ప్రభుత్వం హాయంలో లింగాల కుడి కాలువపై ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. పనుల నిర్మాణ పనుల ద్వారా సమీపంలోని చెరువులను నీటితో నింపేందుకు ఎత్తిపోతల పథకానికి అప్పటి సిఎం, స్థానిక ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహాన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఆమోదం తెలిపారు. దీంతో గత ప్రభుత్వ హాయంలో రూ. 5 కోట్లు విడుదల చెయ్యగా... భూ సేకరణ సమస్య వల్ల నిలిచిపోయాయి. 

గుణకనపల్లె వాసులకు వచ్చిన ఐడియా.... :

తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడిపోతున్న గుణకన్నపల్లె ప్రజలకు, స్థానిక అధికారులకు ఈ నీటి సమస్య నుంచి గట్టెక్కేందుకు ఓ మంచి ఐడియా తట్టింది. అదే  భూగర్భ జలాల రీఛార్జ్ బోర్‌వెల్స్ ప్రాజెక్ట్. భూగర్భ జలాల పునరుజ్జీవనానికి (Groundwater recharge) బోర్‌వెల్ రీఛార్జ్ ప్రాజెక్ట్ అత్యంత సమర్థవంతమైన మార్గం. వాన నీటిని వృథా చేయకుండా భూమిలోకి ఇంకిపోయేలా చేయడం ద్వారా ఎండిపోయిన బోరుబావులకు  పైప్ లైన్ ద్వారా కూడా నీటిని అందించి భూగర్భ జలాలు అడుగంట కుండా చెచెయ్యవచ్చనన్న ఆలోచన తట్టింది.

Article Imageఎలా చేపట్టారు.... ?
గుణకనపల్లె చెరువు నింపేందుకు  చేపట్టిన ఎత్తిపోతల పధకానికి భూసేకరణ సమస్య ఎదురవ్వడంతో పనులు నిలిచిపోయాయి. దీంతో గుణకనపల్లె గ్రామస్తులు బోర్లు వేసి నీటిని నింపితే బాగుంటుందన్న ఆలోచనను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం... అధికారులు ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఎంపి  ల్యాండ్స్ నుంచి నిధులు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దీంతో పెద్దగా ఖర్చు లేకుండానే చెరువుకు సమీపంలో కేవలం ఐదు బోర్లు వేసి లింగాల కుడి కాలువ ద్వారా పైప్ లైన్ ఏర్పాటు చేసి సమీపంలో పంప్‌హౌస్, మోటార్ల ఇన్‌స్టాలేషన్, పైప్‌లైన్ పనులు ద్వారా నీటితో నింపారు. బోర్లలోకి నీరు నింపడంతో నీరు అలానే బోరు నిండకుండా భూమి లోపలికి వెళ్లింది. ఆ నీరు భూమి పోరల ద్వారా పారడం వల్ల ఇప్పుడు ఇక్కడ భూగర్భ జలాలు కూడా పెరిగాయి.  

రెండు మూడు రోజుల్లోనే పెరిగిన వాటర్ లెవల్స్ ..  : 
భూగర్భ జలాల రీఛార్జ్ బోర్‌వెల్స్ ప్రాజెక్ట్ లో భాగంగా బోర్ వెల్స్ రీ స్టోర్ చెయ్యడం ద్వారా  ప్రారంభించిన కేవలం 2-3 రోజుల్లోనే చుట్టుపక్కల బోరుబావుల్లో  వాటర్ లెవల్స్ పెరిగాయి. ఇప్పుడు తీవ్రమైన వేసవి పరిస్ధితుల్లోను రెండు మూడు రోజుల్లోనే నీరు పెరగడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నీరు ఆవిరి కాకుండా నేరుగా భూగర్భంలోనే నిల్వ చేసేందుకు సరికొత్త చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మంచి కేస్ స్టడీగా ప్రాజెక్ట్ గా  నిలిచింది. గతంలో ఇక్కడ  1200 అడుగుల్ల్లోబోర్లు తవ్వాల్సి పరిస్ధితి. కానీ ఇప్పుడు బోర్లలో 500 అడుగుల్లోనే భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయి. 

Article Image

పాపాగ్ని - చిత్రావతి నదుల మధ్య భూగర్భంలో దాదాపు 120 TMC ల నీటి నిల్వ .. : 
భూగర్భ జలాల రీఛార్జ్ బోర్‌వెల్స్ ప్రాజెక్ట్  ద్వారా ఇప్పుడు గుణకనపల్లెలో భూగర్భ జలాలు పెరగగా... ఇదే విధానం ద్వారా మరికొన్ని చేపడితే ... పాపాగ్ని - చిత్రావతి నదుల మధ్య భూగర్భంలో దాదాపు 120 TMC ల నీటి నిల్వ చేసే వీలుందని అధికారులు అంచానా వేశారు. సాధారణంగా 120 టిఎంసీల నీటిని నిల్వ చేయ్యాలంటే భారీ ప్రాజెక్టు నిర్మించాల్సి ఉంటుంది. ఇందుకు పెద్ద ఎత్తున భూసేరణ, పరిహారం వంటి వ్వయం వంటి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొవల్సి ఉంటుంది. కానీ ఆ స్థాయిలో ఖర్చు లేకుండా ...ఇబ్బందులు లేకుండా  వర్షపు నీటినే కాకుండా  సమీపంలోని చిత్రావతి ప్రాజెక్టు నీటి, వర్షపు నీటిని ఉపయోగించుకుని పులివెందుల నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీరిచ్చే అవకాశం లేకపోలేదు. 

Article Image

అరటి తోటలకు భారీ ఉరట ... : 
పులివెందుల నియోజకవర్గం అంటేనే అరటి తోటలకు కేంద్రం. ఇక లింగాల మండలంలోను చాలా వరకు అరటి తోటలే సాగవుతాయి. ఇక్కడి రైతులకు అరకటి తోటలే జీవనాధారం. ఇప్పుడు  గుణకనపల్లెలో  భూగర్భ జలాల రీఛార్జ్ బోర్‌వెల్స్ ప్రాజెక్ట్  ద్వారా  బోర్ వెల్స్ రీ స్టోర్ చెయ్యడం ద్వారా  ప్రారంభించిన కేవలం 2-3 రోజుల్లోనే చుట్టుపక్కల బోరుబావుల్లో  వాటర్ లెవల్స్ పెరగడం ద్వారా  గుణకనపల్లి నుండి రామట్లపల్లి వరకు ఉన్న అరటి తోటలు, ఇతర పంటలకు లభించనున్న భారీ ఊరట లభించింది. అంతేకాకుండా నీటి ఎద్దడి సమస్య తీరింది.  ఈ కొత్త ప్రాజెక్టు ఆవిష్కరణకు సహకరించిన మాజీ సిఎం వైఎస్ జగన్ కు, చొరువ చూపిన కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డికి, అధికారులకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. 

 

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!