* 17న రాజస్థాన్ నుంచి ఆందోళన ...!
* నిరుద్యోగం, పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా నిరసనలు...!!
ASTRANEWS DELHI :
నీట్ పేపర్ లీకేజీపై ఇటీవల తెరపైి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ చేపడుతున్న దేశవ్యాప్త నిరసనల రూటులోకి కాంగ్రెస్ కూడా ఎంట్రీ ఇవ్వనుంది. కోర్టు వ్యాఖ్యలతో ప్రేరణ పొందిన 'కాక్రోచ్' అనే పదంతో మొదలైన పార్టీ నిరుద్యోగ యువత, విద్యార్ధుల ఉద్యమంగా మారి ఇప్పుడు రోడ్డుపైకి వచ్చింది. ఇప్పటికే నీట్ (NEET) పేపర్ లీక్, నిరుద్యోగం, విద్యావ్యవస్థలోని లోపాలకు వ్యతిరేకంగా 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఆధ్వర్యంలో యువత, విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్, హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ (ధర్నా చౌక్), బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ లలో ఈ పార్టీ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు, యువత భారీ ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ఆందోళనలకు ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్చుక్, సీనియర్ పాత్రికేయులు ప్రొ. నాగేశ్వర్, నటుడు ప్రకాష్ రాజ్ తదితరులు ప్రత్యక్షంగా మద్దతు తెలిపారు. మంత్రి రాజీనామా చేసేంతవరకు ఈ నిరసనలు ఆగవని, అవసరమైతే దేశవ్యాప్తంగా మరింత తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే ప్రకటించారు.
ఈ ఉద్యమం ద్వారా కాక్రోచ్ పార్టీ ఇప్పటికే ఎవరికి తలవంచని బిజేపిలో గుబులు రేపడమే కాకుండా ఓ ట్రెండ్ ను క్రీయేట్ చేసింది. ఇప్పుడు ఈ ఉద్యమాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తుండటంతో కొత్తగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నెల 17న రాజస్థాన్ లోని కోటాలో ఆందోళనతో దీనిని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఆపై జులై 10న అలహాబాద్, 11న పట్నా, 14న ఢిల్లీలోనూ కాంగ్రెస్ నిరసనలు చేపట్టనుంది. మొత్తానికి ఆలస్యంగానైనా కాంగ్రెస్ పార్టీ మరో జాతీయ స్థాయి ఉద్యమంలోకి దిగనుంది.
ఈ ఉద్యమాల నేపధ్యంలో ఇప్పటి వరకు పట్టుపట్టనట్లు వ్యవహరిస్తున్న కేంద్రం ఇక ముందు ఎలా స్పందిస్తుందొ వేచి చూడాలి. కాక్రోచ్ కొత్త పార్టీ కావడంతో కేంద్రం కూడా తేలిగ్గా తీసుకున్నా... కాక్రోచ్ కు వచ్చిన స్పందన ఎవ్వరు ఉహించలేనిదనే చెప్పవచ్చు. ఇప్పడు ఈ ఉద్యమాలే దేశవ్యాప్తంగా విస్తరిస్తుండటం కలవరాన్ని రేపుతున్నాయి. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ కూా జతవ్వుతుండటంతో మరి ఉద్యమాలు ఎఫెక్ట్ ఎలా ఉండబొతుందన్నది వేచి చూడాలి