* రాజకీయ విమర్శలతో చులకన కారా..?
* సాధువుల చీకటి భాగోతాలపై ప్రతి విమర్శలు...
* ప్రభోదాలు వదిలి....రాజకీయ పార్టీల ఆజెండాలు మోయడం సమంజసమా ?
ASTRA NEWS :
కొందరు సాధవులు చూపిస్తున్న అత్యుత్సాహం ... అది వారికున్న మరకల్ని జనాలకు తెలిసేలా చేస్తుందంటే ఇదేనేమో. కొంత మంది సాధవులు హిందూ ఆత్మీయ సమ్మేళనం పేరుతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ... వాటికున్న అర్ధన్ని కూడా మార్చేస్తున్నారు. సనాతన ధర్మం, ధార్మికమైన ప్రబోధాలు ప్రభోదిస్తూ సాగాల్సిన హిందూ అత్మీయ సమ్మేళనం అది కాస్త రాజకీయ రంగు పులుముకోవడం సాధువులకే మచ్చతెచ్చేవిలా ఉన్నాయి. తిరుపతిలో నిర్వహించిన హిందూ ఆత్మీయ సమ్మేళనంలో సాధువులు మాట్లాడిన మాటలు చూస్తే.. వారికంటే రాజకీయ నాయకుల ప్రకటనలే మేలేమో అనే అభిప్రాయం కలగకమానదు.
తిరుపతిలో నిర్వహించిన ఈ హిందూ అత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఏపీ సాధుపరిషత్ గౌరవాధ్యక్షుడు అట్లూరి నారాయణరావు, శ్రీనివాసానంద సరస్వతి, మరికొందరు సాధువులు మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించేవారికి తగిన బుద్ధి చెబతామని, హిందువులందరూ వైఎస్సార్ కాంగ్రెస్ ను బహిష్కరించాలని పిలుపు ఇవ్వడం చూస్తే..వీరు సాధువులా .. లేక రాజకీయ ప్రత్యర్ధులా అన్న అనుమానాలు కలగకమానదు. ఏకంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ... భూమన కరుణాకర రెడ్డి హిందూ స్వామీజీలను కించపరిచేలా మాట్లాడారని అయనపై ఈ సాధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమన సాధువులను టార్టెట్ గా వ్యాఖ్యలు చేశారనుకున్నా.... అందుకు ప్రతిగా ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే బహిష్కరించాలని పిలుపునివ్వడం కూడా మరోక రాజకీయ పార్టీ రంగు పులుముకున్న సాధువు అత్యుత్సాహం అని ఎందుకు అనుకోకూడదన్నది ప్రశ్న. మొత్తానికి ఏపీ సాధుపరిషత్ గౌరవాధ్యక్షుడు అట్లూరి నారాయణరావు చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రతిగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఘటుగానే ప్రతిస్పందిస్తూ ఏపీ సాధుపరిషత్ గౌరవాధ్యక్షుడు అట్లూరి నారాయణరావు బండారం మొత్తం బయట పెట్టారు.
ఏపీ సాధుపరిషత్ గౌరవాధ్యక్షుడు అట్లూరి నారాయణరావు టిడిపి అధినేత చంద్రబాబుకు పరమ భక్తుడు. తిరుపతిలో బ్లాక్‌లో టికెట్లు అమ్ముకునే బ్రోకర్. అలాంటి వ్యక్తి హిందూ సంఘాల అధ్యక్షుడా? బాలిక మీద అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నశ్రీకాకుళానికి చెందిన శ్రీనివాస సరస్వతి అనే మరో వ్యక్తి ఇప్పుడు టీడీపీతో రోజూ రెండు లెటర్లు అమ్ముకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు. పేరులో తప్ప గుణంలో ఏమాత్రం సరస్వతి లేనటువంటి వాడు. రూ.500 ఇస్తే అర కిలో అశుద్ధాన్ని మింగడానికి కూడా వెనకాడని మరో వ్యక్తి. ఇతడు గతంలోనే నా వద్దకు వచ్చి శివానంద స్వామి, శ్రీనివాస సరస్వతి గురించి చాలా ఆరోపణలు చేసి వెళ్లాడు. వీళ్లంతా చంద్రబాబు కపట నాటకంలో పాత్రలు మారి కాషాయ వస్త్రాలు ధరించి టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలతో వీరి ఆధ్వర్యంలో తిరుపతిలో ఒక గుంట నక్కల సభను నిర్వహించారు. ఆ సమావేశానికి హిందూ బంధువులంతా కలసి రండి అని పిలుపు నిచ్చి ఈ రాబందులంతా వాలాయి. శ్రీవారి సేవకుల ముసుగులో సాధువుల వేషంలో వచ్చి టీడీపీ జెండాలు మోసే కూలీలుగా బీఆర్ నాయుడు మార్చి ప్రదర్శన చేశారు. ఈ గోముఖ వ్యాఘ్రాలు అనంగుని సేవకు తప్ప అనంతుని సేవకు పనికొచ్చేవారు కాదు. వీరంతా రాక్షస డీఎన్‌ఏ కలిగిన పరమ నీచ నికష్టులు ధర్మం గురించి మాట్లాడితే హిందూ సమాజం తలెత్తుకోగలదా ? అంటూ ఘాటుగానే ప్రతిస్పందించారు.
సాధువులు సనాతన ధర్మం, ధార్మికమైన ప్రబోధాలు ప్రభోదిస్తూ సాగాల్సి ఉండగా... రాజకీయ పార్టీలపై విమర్శలు చెయ్యడం సమంజసమా అనే ప్రశ్న సామాన్యులకు సైతం ఎదురవుతోంది. ఇలాంటి విమర్శలతో సాధువులు చులకన కారా ? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సాదువులు సనాతన ధర్మం, ధార్మికమైన ప్రబోధాలకు పరిమితమైతే...సాదువులను సాధువులుగాన ఎప్పటికైనా గౌరవం ఉంటుందన్నది అందరి అభిప్రాయం.