* "ఫాదర్స్ డే " ను పురష్కరించుకుని వైఎస్ జగన్ ఎక్స్ లో ట్విట్ ...
Father's day wishes ys jagan :
ఫాదర్స్ డే సందర్భంగా వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని స్మరించుకున్నారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందిస్తూ, తన జీవితంలో తాను చూసిన గొప్ప నాయకుడు, మంచి మనిషి వైఎస్సార్ అని కొనియాడారు. వైఎస్ఆర్ తో ఉన్న అనుబంధాన్ని అయన ద్వారా తాను నేర్చుకున్న జీవిత పాఠాలను ఈ ట్వీవ్ లో అత్మీయంగా గుర్తుచేసుకున్నారు.

నా జీవితంలో నేను చూసిన గొప్ప నాయకుడు, మంచి మనిషి మా నాన్న వైఎస్సార్. ప్రజల పట్ల ప్రేమతో ఉండటం, నిస్వార్థంగా సేవ చేయడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా నిలబడటం వంటివి తన తండ్రి తనకు నేర్పారని తెలిపారు. వైఎస్సార్ చూపిన మార్గం, ఆయన నేర్పిన విలువలు ప్రతిరోజూ తనకు స్ఫూర్తినిస్తూ, ప్రజల కోసం పనిచేసే శక్తిని ఇస్తున్నాయని పేర్కొన్నారు. నేటి ఫాదర్స్ డేను స్మరించుకుంటూ .. అందరికి ఫాడర్స్ డే అంటూ అయన ట్వీట్ లో రాసుకొచ్చారు.