Tuesday, 28 July 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / క్రీడలు

రెచ్చగొట్టి .. చితకొట్టించుకున్నారు ... !

21 Jun 2026
02:05 PM
42

* శ్రీలంక ఏ ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్లో సూర్య వంశీ సింహతాండవం ...
* 11 బంతుల్లోనే ఆర్ధ సెంచరీ ...29 బంతుల్లో 94 పరుగులతో యువరాజ్ రికార్డ్ ను బద్దలు ...

Vaibhav Suryavanshi  : 

'ఆరోజు ఆ మిస్టేక్ చేయకుండా ఉండాల్సింది. అతడిని గెలకకుండా ఉండాల్సింది. అనవసరంగా గెలికాం. అతడి గురించి తెలియకుండా మాట్లాడాం. చివరికి అనుభవిస్తున్నామని” కచ్చితంగా శ్రీలంక ప్లేయర్లు అనుకొని ఉంటారు ఈ రోజు. ప్రతి బంతిని అతడు శివాలెత్తి కొడుతుంటే చింతించి ఉంటారు. కన్నీరు పెడుతూనే ఉండి ఉంటారంటే అతిశయోక్తి కాదు. అతడు ఎవరో కాదు. టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ.

శ్రీలంక 'ఎ' జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో  కేవలం 11 బంతుల్లోనేలిస్ట్ 'ఎ' క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం సాధించాడు . ట్రై-నేషన్ సిరీస్ ఫైనల్‌లో 29 బంతుల్లో విధ్వంసకరమైన 94 పరుగులుచేసి అతను ఈ రికార్డును అందుకున్నాడంటే అతడు ఏ స్టైయిల్ లో అడి ఉంటాడో ఉహించుకోవచ్చు. 

Article Image

వైభవ్ సూర్య వంశీ 15 సంవత్సరాల బుడ్డోడు మాత్రమే కాదు.. అంతకు మించిన డైనమైట్. ఐపీఎల్లో హయ్యెస్ట్ రన్స్ చేసి.. ఆరెంజ్ టోపీ అందుకున్న ఘనత అతడిది. అటువంటి ఆటగాడిని శ్రీలంక ప్లేయర్లు అనవసరంగా గెలికారు. మ్యాచ్ గెలిచిన ఆనందంలో.. బుడ్డోడని గేలీ చేశారు. అతడేమో మైదానంలో విశ్వరూపం చూపిస్తున్నాడు. తన బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుందో.. తనకు కోపం వస్తే ఎలా ఉంటుందో రుచి చూపించాడు.

ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక ఏ జట్టు మీద సూర్య వంశీ 11 బంతుల్లోనే ఆర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 5 సిక్సర్లు.. ఐదు ఫోర్లు ఉన్నాయి. పరుగులు మొత్తం సిక్సర్లు, బౌండరీ రూపంలో వచ్చాయి వన్డే హిస్టరీ లో ఇది ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. గతంలో అంతర్జాతీయ క్రికెట్ లో డివిలియర్స్.. మాథ్యూ ఫోర్డ్ (వెస్టిండీస్) తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు.

ఇటీవల శ్రీలంక ఏ జట్టుతో జరిగిన గత మ్యాచ్ లో వైభవ్ అంతగా సత్తా చూపించలేదు. అతడు త్వరగానే అవుట్ అయ్యాడు. ఆ మ్యాచ్లో టీమిండియా సూపర్ ఓవర్ లో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్లేయర్లు సూర్య వంశీని ఉద్దేశించి గేలి చేశారు. అతడిని ఆటపట్టించారు. దీంతో సూర్య వంశీ కోపంతో వారి మీదికి వెళ్ళాడు. ఆ సంఘటన అంతర్జాతీయ క్రికెట్లో సంచలనం కలిగించింది. శ్రీలంక ప్లేయర్లు తనకు చేసిన అవమానాన్ని గుర్తుంచుకున్న సూర్య వంశీ రెచ్చిపోయాడు. ఫైనల్ మ్యాచ్ లో క్రీజ్ లోకి వచ్చిన అతడు 29 బంతుల్లో 94 పరుగులు చేశాడు. సెంచరీ చేస్తాడనుకున్న క్రమంలో షాహన్ బౌలింగ్లో సూర్య అవుట్ అయ్యాడు. కానీ సూర్య ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు.. 8 సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ ఆర్య 24 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఇందులో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ గా ఉన్నాయి. టీమిండియా కేవలం 9 ఓవర్లలోనే 132 పరుగులు చేయడం విశేషం. ఈ  ఫైనల్‌లో భారత్ 'ఎ' జట్టు 50 ఓవర్లలో 377/9 స్కోరుతో తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. కేవలం 29 బంతుల్లోనే అద్భుతమైన 94 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ ఆర్య , అనుకుల్ రాయ్ చివర్లో మెరుపు ఇన్నింగ్స్‌లతో కలిసి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచడంతో భారీ స్కోర్ సాధించింది. 

 

 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!