* తీర్పును పున:పరిశీలించాలంటూ సుప్రీం కోర్టు న్యాయమూర్తి విన్నవిస్తూ...
* కడప నుంచి పోస్టుకార్డు ఉద్యమం... వైసీపీ రాష్ర్ట సంయుక్త కార్యదర్శి కిషోర్ బూసిపాటి ...
* సంఘీభావం తెలిపిన కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి ...
కడప :
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తిందంటూ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దారుణమని, ఈ తీర్పును పున:పరిశీలించాలని కోరుతూ కడప కేంద్రం పోస్టుకార్డు ఉద్యమం ముమ్మరం చేశారు. కడప నగరానికి చెందిన వైసీపీ రాష్ర్ట సంయుక్త కార్యదర్శి కిషోర్ బూసిపాటి పోస్టు కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న దళిత క్రైస్తవుల మద్దతుతో తీర్పును పున:పరిశీలించాలని కోరుతూ ప్రధాన న్యాయమూర్తికి పోస్టు కార్డు ఉద్యమంతో తమ ఆవేదనను, జరిగే నష్టాన్ని తెలియజేయడమే లక్ష్యంగా పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపట్టారు. సోమవారం ఈ పోస్టుకార్డు ఉద్యమాన్ని కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా..అయన తన వంతు మద్దతు తెలుపుతూ కార్డుపై అయన కూడా సంతకం చేశారు. ఈ సందర్బంగా వైసీపీ రాష్ర్ట సంయుక్త కార్యదర్శి కిషోర్ బూసిపాటి మాట్లాడుతూ మతం మారినంత మాత్రాన అసమానాతలు తొలగిపోవని, అందువల్ల దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగించాల్సిందేనన్నారు. దేశంలో దళిత వర్గాలకు సంబంధించిన 26 కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం విధానం, సుప్రీంకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు సమంజసం కాదన్నారు. తక్షణం మీరు ఇచ్చినటువంటి తీర్పును పునఃపరిశీలించి సింగిల్ బెంచ్ తీర్పును పుర:పరిశీలించి సరైన తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నిర్ణయం సరైనది కాదని తెలియజెప్పేందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పోస్ట్‌కార్డ్ ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, తీర్పు ఇచ్చన సుప్రీంకోర్టు జస్టిస్‌కు ఈ పోస్ట్‌కార్డ్ ల ద్వారా రిప్రజెంట్ చేయడం జరుగుతోందన్నారు. ఈ యొక్క తీర్పును తప్పక పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని, ఈ తీర్పుపై కడప ఎంపిగా తమ మనోభావాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఎంపి అవినాష్ రెడ్డిని కోరగా... అయన కూడా దళిత క్రైస్తవుల సమస్య చాలా న్యాయమైన డిమాండ్ అని తప్పక ఈ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని కార్డుపై సంతకం చేసి మద్దతు ప్రకటించారు. ఇది వరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపిలు కూడా కేంద్రానికి ఈ సమస్యపై విన్నవించడం జరిగిందని, దళిత క్రైస్తవులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ పోస్టుకార్డు ఉద్యమానికి తన వంతు పూర్తి స్థయిలో మద్దతు తెలుపుతున్నానని, రాష్ర్ట స్థాయిలో కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగించేలా పార్టీ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటి సిఎం అంజాద్ బాష కూడా మద్దతు తెలిపారు.

క్యాధలిక్ డయాసిస్ బిషప్ రెవరెండ్ పాల్ ప్రకాష్, ఫాదర్స్ మద్దతు :
ఈ కార్యక్రమానికి కడప క్యాధలిక్ డయాసిస్ బిషప్ రెవరెండ్ పాల్ ప్రకాష్, ఇతర మత గరువులు కూడా మద్దతు పలికారు. మద్దతుగా పోస్ట్ కార్డులపై సంతకం చేసి కేసును పున:పరిశీలించాలని డిమాండ్ చేశారు. తరాలుగా వెనెకబాటుతనంతో మగ్గిపోతున్న దళిత వర్గాలకు ఇలా మత పేరుతో ఎస్సీ హోదా తొలగించాలనుకోవడం అన్యాయమని, తప్పక కేసు పున:పరిశీలించాలని కోరారు.