Tuesday, 28 July 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

క్రెడిట్ చోరీ... జగన్ పై బురదజల్లేందుకే స్టీల్ ప్లాంటు శంకుస్థాపన కార్యక్రమం....

04 Jul 2026
06:23 PM
130

• మేము శంకుస్థాపన చేసిన చోటే మళ్లీ శంకుస్థాపన నాటకం...
చంద్రబాబు గాలి తీసేసిన సజ్జన్ జిందాల్ Tweet.....
•స్టీల్ ప్లాంట్ విషయంలో క్రెడిట్ చోరీ చేయాలనుకున్న కూటమికి ఎదురుదెబ్బ...
మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్న వ్యక్తులు చంద్రబాబు, ఆదినారాయణరెడ్డి....
• వైసీపీ అధికారంలోకి వచ్చాక దేవగుడిలో మళ్లీ వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తాం... MP YS అవినాష్ రెడ్డి ఫైర్

కడప   :
కూటమి క్రెడిట్ చోరీ... మాజీ సిఎం జగన్ పై బురదజల్లేందుకే కడప స్టీల్ ప్లాంటు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారని
కడప ఎంపీ అవినాష్ రెడ్డి విమర్శించారు. కడప స్టీల్ ఫ్యాక్టరీకి అవసరమైన అన్నీ అనుమతులు, పారిశ్రామిక వేత్త ముందుకు రావడం అన్ని మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయన్నారు. శనివారం కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్ చోరీకి ప్రయత్నించిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి 2019 లోనే  జేఎస్ఈబ్ల్యూ సంస్థను వైఎస్ జగన్ ప్రభుత్వం ఒప్పించిందని.... 2022లో ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించి జీవో జారీ చేయడంతో పాటు భూసేకరణ కూడా పూర్తిగా జగన్ హయాంలోనే జరిగిందన్నారు. ప్రాజెక్టు కోసం 1100 ఎకరాల భూకేటాయింపు కూడా ఫేజ్-1లోనే చేపట్టినట్లు వివరించారు.

2023 ఫిబ్రవరిలో సీఎం వైఎస్ జగన్ ఈ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారని అవినాష్ రెడ్డి గుర్తుచేశారు. అంతేకాకుండా పర్యావరణ అనుమతులు సహా అవసరమైన అన్ని క్లియరెన్సులు వైసీపీ ప్రభుత్వమే తీసుకువచ్చిందన్నారు. ఇవన్నీ చేశాం కాబట్టే...నిన్న సజ్జన్ జిందాల్ వైఎస్ జగన్ కు ధన్యవాదాలు తెలిపారన్నారు. సభలో ఈ ప్రాజెక్టుపై తాజాగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను వైఎస్ అవినాష్ తప్పుబట్టారు.“ఫ్యాక్టరీని తానే తెచ్చానని చెప్పుకుంటూ క్రెడిట్ దోచుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. సభ స్టీల్ ఫ్యాక్టరీ కోసం కాకుండా.. కేవలం వైఎస్ జగన్ ను దూషించడానికే పెట్టినట్లు ఉందని అన్నారు.

2007లో వైయస్సార్ బ్రహ్మీని స్టీల్ తెచ్చారని, ఆయన మరణానంతరం ఆ పనులు ఆగిపోయాయన్నారు. మళ్లీ 2018లో అప్పటి సీఎం చంద్రబాబు కంబాలదిన్నె వద్ద శంకుస్థాపన చేశారని, శంకుస్థాపన, భూమిపూజ చేశారు కానీ ఏ సంస్త నిర్మిస్తుందొ తెలియదన్నారు. ఎన్నికల స్టంట్ గా అప్పట్లో భూమిపూజ చేసారని ఎత్తిచూపారు.

కడప స్టీల్ ప్లాంటుపై చంద్రబాబు, ఆదినారాయణరెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్న వ్యక్తులని మండిపడ్డారు. ఆదినారాయణ రెడ్డి...నువ్వు అసలు మనిషివేనా...? అన్ని విధాలా వైఎస్ కుటుంబం నీకు అండగా ఉంటే ఆ కుటుంబాన్ని దోషిస్తున్నావు అంటూ అగ్రహాం వ్యక్తం చేశారు. నువ్వు అధికారంలో ఉంటే ఆదినారాయణరెడ్డి..లేదంటే నువ్వు నిక్కర్ నారాయణ మాత్రమేనని, నువ్వు చేసే చేతలకు తప్పనిసరిగా సమాధానం ఇచ్చే రోజు వస్తుందని,
ఆదినారాయణరెడ్డి...మీ ఊర్లోనే మళ్ళీ వైయస్సార్ విగ్రహం పెట్టే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో అంటూ హెచ్చరించారు.

అమరావతి రాజధాని ప్రాజెక్టుపై కూడా అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ప్రజారాజధాని కాదని, అది ఒక వర్గానికి చెందిన రాజధానిగా మారిందన్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అంగీకరించారని గుర్తుచేస్తూ... శివరామకృష్ణ కమిటీ సూచనలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని.. అమరావతి కోసం సుమారు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయాలని చూస్తున్నారన్నారు. వైఎస్ జగన్ మాత్రం మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు ప్రాంతాలను కలిపే “మావిగన్” వంటి ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను ప్రతిపాదించారన్నారు.


Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!