Tuesday, 28 July 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / అంతర్జాతీయ వార్తలు

ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. పశ్చిమాసియాలో బీకర యుద్దం....

12 Jul 2026
01:39 PM
69

* వాణిజ్య నౌకపై దాడికి ప్రతీకారంగానే చర్యలన్న అమెరికా
* హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటన
* ఒప్పందాన్ని అమెరికానే ఉల్లంఘించిందన్న ఇరాన్
* పశ్చిమాసియాలో అత్యంత ప్రమాదకర స్థాయికి ఉద్రిక్తతలు

ASTRA DESK   : 
పశ్చిమాసియాలో మళ్లీ భీకర యుద్దానికి దారితీసింది.  అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరాయి. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ దాడికి ప్రతీకారంగా, శనివారం తెల్లవారుజామున అమెరికా సైన్యం ఇరాన్‌పై మరోసారి భీకర దాడులు జరిపింది. వారం వ్యవధిలో ఇరాన్‌పై అమెరికా దాడులకు దిగడం ఇది మూడోసారి కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

Article Image

అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించిన వివరాల ప్రకారం, శనివారం తెల్లవారుజామున 5:45 గంటలకు ఇరాన్‌లోని పలు లక్ష్యాలపై అమెరికా బలగాలు దాడులు చేశాయి. అంతకుముందు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ), హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న 'ఎమ్/వి జిఎఫ్ఎస్ గెలాక్సీ' అనే వాణిజ్య నౌకపై దాడి చేసింది. ఈ ఘటనలో నౌక ఇంజిన్ రూమ్ తీవ్రంగా దెబ్బతిని మంటలు చెలరేగాయి. ఒక సిబ్బంది కూడా అదృశ్యమయ్యారు. వాణిజ్య నౌకలపై దాడులు చేసే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఈ దాడులు జరిపినట్లు సెంట్‌కామ్ స్పష్టం చేసింది. ఈ దాడులపై అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ "ఇరాన్ తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దానికి తగిన మూల్యం చెల్లించుకుంటోంది" అని తీవ్రంగా హెచ్చరించారు.

హర్మూజ్ జలసంధి మూసివేత ... :
అమెరికా దాడులకు కొన్ని గంటల ముందే ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన వాణిజ్య రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాంతంలో అమెరికా జోక్యం ఆగిపోయే వరకు ఏ అంతర్జాతీయ నౌకను అనుమతించేది లేదని ఐఆర్‌‌జీసీ నేవీ స్పష్టం చేసింది. దశాబ్దాలుగా ఇది అంతర్జాతీయ జలమార్గంగా ఉన్నప్పటికీ, తమ సార్వభౌమ ప్రాంతంగా పరిగణిస్తూ నౌకల నుంచి పన్నులు వసూలు చేస్తామని ఇరాన్ వాదిస్తోంది. అమెరికా దాడుల తర్వాత ఇరాన్‌లోని ఖేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్, సిరిక్‌లలో భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

తప్పంతా అమెరికాదేనన్న ఇరాన్ ...  : 
ఈ పరిణామాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందిస్తూ, అమెరికానే తమ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఇరాన్ చమురు అమ్ముకోవడానికి ఇచ్చిన మినహాయింపులను అమెరికా ఏకపక్షంగా రద్దు చేయడమే దీనికి కారణమన్నారు. అయితే, హర్మూజ్ జలసంధిలో ఇరాన్ దాడులకు పాల్పడటం వల్లే చమురు మినహాయింపులు రద్దు చేశామని అమెరికా వాదిస్తోంది. ఈ పరస్పర దాడులు, ఆరోపణలతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింతగా ముదిరింది.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!