Tuesday, 28 July 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / అంతర్జాతీయ వార్తలు

త్వరలో ప్రజల ముందుకు రానున్న ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా..!

12 Jul 2026
06:13 PM
19

IRAN :
ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ త్వరలో ప్రజల ముందుకు రానున్నారు. తన తండ్రి దివంగత అయతుల్లా అలీ ఖమేనీ స్మారకార్థం జులై 23న టెహ్రాన్లో జరిగే కార్యక్రమంలో తొలిసారి ప్రజల ముందుకు రానున్నారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడిలో అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో మొఙబా గాయపడ్డారనే ఊహాగానాలను ఇరాన్ ఖండించింది. భద్రతా కారణాల వల్ల అజ్ఞాతంలో ఉన్న మొఙబా బయటకు రాకపోవడం వల్ల .. ఆరోగ్యం మరియు రాజకీయ అనిశ్చితిపై ప్రపంచవ్యాప్తంగా అనేక ఊహాగానాలు వచ్చాయి. ఆ దాడుల్లో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయని, కోలుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అధికార వర్గాలు వీటిని ఖండించినా ...తన తండ్రి అంత్యక్రియలకు కూడా హజరవ్వలేదు. కానీ తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం "దేశం యొక్క డిమాండ్" అని మొజ్తబా ఖమేనీ ఇటీవల టెలిగ్రామ్ ద్వారా ఒక లిఖితపూర్వక సందేశంలో పేర్కొన్నారు. దీంతో ఈ ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి ఇంతకాలం తర్వాత మొజ్తబా ఖమేనీ ప్రజలకు కనిపించనుండటం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జూలై 23న టెహ్రాన్‌లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) స్మారక సభను మొజ్తబా నిర్వహించనున్నారని సమాచారం. సాయంత్రం 5 గంట‌ల‌ నుంచి 7 గంటల మధ్యలో నిర్వహించే ఈ కార్యక్రమంలో దేశంలోని కీలక నేతలందరూ పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!