* కొత్తూరు మండలం పంజర్ల గ్రామం వద్ద ఒక వెంచర్లో ఆత్మహత్యకు పాల్పడ్డ రాజ్ కుమార్
ASTRANEWS DESK:
తెలంగాణలో సంచలనం సృష్టించిన షాబాద్ పోక్సో, ఆరు హత్యల కేసు నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తూరు మండలం పెంజర్ల గ్రామం శివారులోని ఓ వెంచర్‌లో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం పక్కనే పురుగుమందు (పాయిజన్) సీసా లభించడంతో, అతను విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
తనపై పోక్సో కేసు పెట్టిందనే కక్షతో రాజ్‌కుమార్ మైనర్ బాలిక, ఆమె తల్లి, నానమ్మతో పాటు తన భార్య, ఇద్దరు పిల్లలను కిరాతకంగా హత్య చేశాడు.
మూడు రోజుల పాటు పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ అచూకీ లభించలేదు. ఈ రోజు స్థానికులు డయల్-100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.