○ 45 ఏళ్లుగా ఓటు వేస్తున్నా...నా ఓటు లేకపోవడం విడ్డూరం...
○ నా పరిస్థితే ఇలా ఉంటే...ఇక చదువు లేనివారి పరిస్దితేంటి?...
○ అడ్మినిస్ట్రేషన్ అస్సలు బాగాలేదు...
○ మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణ తీవ్ర అసహనం....
ASTRANEWS :
నేను మాజీ మంత్రిని....45 యేళ్ళుగా ఓటేస్తున్నా...కానీ నా ఓటే లేదంటున్నారు...నా పరిస్థితే ఇలా ఉంటే...చదవురానీ వారి పరిస్థితి ఎంటీ ? అంటూ మాజీ మంత్రి, డాక్టర్ శనక్కాయల అరుణ సోమవారం గుంటూరులోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న సర్ ప్రక్రియపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
విద్యావంతురాలైన తనకే ఇటువంటి ఇబ్బందులు ఏర్పడితే చదువులేని వారి సంగతి ఏంటని ప్రశ్నించారు. 45 ఏళ్లుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న తన ఓటు కనబడడంలేదని బీఎల్ఓలు చెప్పడంతో పాటు త్వరలోనే నోటీసులు పంపుతాం వచ్చి హాజరు కావాలని చెబుతున్నారు. 2002 ముందు ఓటరు కార్డు చూపించినా ఓటు లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ఓటు లేదని చెబుతున్న సమయంలో తాను రాష్ట్ర మంత్రిగా పనిచేశానని గుర్తు చేశారు. సర్ ప్రక్రియ దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోందన్నారు. అడ్మినిస్ట్రేషన్ అసలు బాగాలేదని విమర్శించారు. సర్ ప్రక్రియపై సీఎం చంద్రబాబు దృష్టిసారించాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. గతంలో ఎన్నికల కమిషనర్ పనిచేసిన టీఎన్ శేషన్ లాంటి వారు తిరిగి రావాలని ఆకాంక్షించారు.