● పక్షపాతం చూపిస్తున్న సీమ ద్రోహి చంద్ర బాబు...
● సీమ ఎత్తిపోతల పథకంపై కారుకూతలు కూసి సీమను ఎండగడుతున్నారు....
● కాగితాలకే పరిమితం చేసిన రాయలసీమ అభివృద్ధి ...
కడప :
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఎల్నీనో పరిస్థితుల్లో సీమకు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆవసరం ఎంత ఉందో ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ట్రయల్ రన్ నిర్వహించి ఒక గంటన్నర పాటు ఒక పంపును ఆపరేట్ చేస్తే దాదాపు ఒక టీఎంసీ నీటిని తోడింది.

ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని పోలవరం కుడి కాలువ మీదుగా తీసుకుని వచ్చి పవిత్ర సంగమం దగ్గర నీళ్లు కలిసే చోట పూజా కార్యక్రమాలు నిర్వహించి కృష్ణా డెల్టాకు నీళ్లిస్తున్నానని చెప్పి గట్టిగా ప్రకటించారు. కానీ తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు తీసుకుపోతోంది. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ తీసుకుపోతోంది. ఎటొచ్చి మధ్యలో ఎల్నినో ప్రభావం వల్ల తాగడానికి గుక్కెడు మంచినీటి కోసం కటకటలాడాల్సిన పరిస్థితి రాయలసీమది. సీమకు సంబంధించినటువంటి నీటిని తీసుకోవాలంటే.. నికర జలాలు కలిగినటువంటి కేసీ కెనాల్‌కు గానీ, శ్రీశైలం కుడికాలువకు గానీ నీళ్లు తీసుకోవాలంటే ఇవాళ శ్రీశైలంలో కనీస నీటిమట్టం 854 అడుగులకు వస్తే తప్ప నీళ్లు తీసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి రాయలసీమది. 
విజనరీనని చెప్పుకునే చంద్రబాబు ఏం మాట్లాడారు? రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని కారుకూతలు కూసినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వం ఈరోజు ఏం సమాధానం చెప్తారు? పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆపరేట్ చేస్తా ఉంటే, మరి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు ఎందుకు ఆపేశారు అని చెప్పి మేము అడగదలుచుకున్నాం. పైగా ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు పూర్తికి సంబంధించిన రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు కేటాయించేటువంటి అంశంలో కృష్ణా నీటిలో 39.9 టీఎంసీల నికర జలాలు కలిగినటువంటి కేసీ కెనాల్ చివరి ఆయకట్టు స్థిరీకరణ కోసం ఉద్దేశించినటువంటి రాజోలి రిజర్వాయర్ నిర్మాణానికి మూడు సార్లు శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటికీ ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయించేటువంటి అంశం కానీ పూర్తి చేసేటువంటి బాధ్యత కానీ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందంటే.. వీళ్ళు రాయలసీమ పట్ల రాయలసీమ రైతాంగం పట్ల వీళ్ళ చిత్తశుద్ధి ఏదో స్పష్టం అవుతుంది. పైగా రాయలసీమ పైన ఏదో వీళ్ళు ఏదో ఎలగబెట్టినట్టు, ఏదో వరాలజల్లు కురిపించినట్టు అసలు జేఎస్‌డబ్ల్యూకి సంబంధించిన ఒక ప్రైవేట్ సంస్థ ఫ్యాక్టరీ నిర్మాణానికి పూనుకుంటే దానికి సంబంధించినటువంటిది కోట్లాది రూపాయలు ఖర్చు చేసి దాన్ని నానాయాగీ చేసినాడు చంద్రబాబు నాయుడు.?ఆయన కొడుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ రెండో దశ పనుల విస్తరణ పనుల కోసం వస్తే, ఒక వైపు సమస్యలు ఉంటే సమస్యలను పట్టించుకోకుండా దాల్మియా సిమెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన రెండో దశ పనులు చేసాం, మేమేమో ఎలగబెడుతున్నాం ఈ ప్రాంతంలో జగన్ మోహన్ రెడ్డి రాయలసీమకు పట్టినటువంటి క్యాన్సర్ గడ్డ అని చెప్పి మాట్లాడుతున్నారు. దాని జోలికి మేము పోదల్చుకోలేదు.
ఎవరైనా సరే ఈ రాయలసీమకు సంబంధించినటువంటి హక్కులు, అవకాశాలు కోల్పోయినటువంటి ఈ ప్రాంతంలో మీరు ఏం చేశారు? ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఎందుకు పెట్టలేదు? మరి ఇవాళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో వేల ఎకరాల భూములు తీసుకొని రెండు దశాబ్దాలు పూర్తయింది. ఇప్పటికీ ఎందుకు ఏర్పాటు చేయించలేకపోతున్నారు?
ఈ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయించండి. ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయించండి. ఐటీ పరిశ్రమ కోసం ఇది వరకు తీసుకున్నటువంటి భూముల స్థానంలో ఐటీ పరిశ్రమ ఏర్పాటు చేయించండి. కడప-బెంగళూరు రైల్వే మార్గం ఏర్పాటు చేయించండి. సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయించండి, ఇవేమీ చేయరు. ప్రాజెక్టులకు సంబంధించి పట్టించుకోరు. పరిశ్రమలకు సంబంధించి పట్టించుకోరు. కేవలం ఏదైనా ఖర్చులు చేయాల్సి వస్తే రాయలసీమ కేంద్ర బిందువుగా చేసుకొని ఊకదంపుడు ఉపన్యాసాలకు పరిమితం అవుతున్నారు తప్ప ....నిజంగా రాయలసీమ ప్రజలకు అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదు. గత చంద్రబాబు నాయుడు చరిత్రంతా రాయలసీమకు ద్రోహం, అన్యాయం ఒడిగట్టినటువంటి చరిత్ర తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా చేసినటువంటి దాఖలాలే లేవు.
కాబట్టి రాయలసీమ రైతాంగం ఒక్కటే ఆలోచన చేయాలి. హక్కులు, అవకాశాలు పోయినటువంటి అనేక తరతరాలుగా దగాపడినటువంటి రాయలసీమ రైతాంగం... మేలుకోకపోతే మరో తరం నష్టపోయేటువంటి వాస్తవాన్ని గ్రహించాలి రాయలసీమ ఎత్తిపోతుల సాధనే లక్ష్యం గా సమరశిల పోరాటాలకు సమాయత్తం కావాలని ఈ సందర్భంగా కోరుతున్నాము.
గాలి చంద్ర
సిపిఐ జిల్లా కార్యదర్శి ,కడప.