* రాహుల్ నేతృత్వంలో ఎంపీల ఆందోళన ....
* నీట్ పేపర్ లీకేజీ మంత్రిని రాజీనామా చెయ్యించలేని ...
* వీక్ ప్రధాని మోడి ... అంటూ రాహుల్ ఫైర్ ....
* ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్..
DELHI :
దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల తొలి రోజు కాక్రోచ్ పార్టీ మద్దతుదారుల ఆందోళనలతో హైటెన్షన్ వాతావరణం నెలకొనగా...ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏకంగా ప్రధాని ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేస్తూ అక్కడే నిరసన కార్యక్రమాన్ని చేపట్టడంతో మరింత హై టెన్షన్ నెలకొంది. అకస్మాత్తుగా ప్రధాని మోదీ ఇంటి ముందు కాంగ్రెస్ పార్టీ ధర్నాకు దిగడం కలకలం రేపింది. కాకోచ్ పార్టీ నిరసనల క్రమంలో నిరసన కారులపై లాఠీ ఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని నిరసిస్తూ..ప్రతపక్ష కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనల్లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్.. ఇతర కాంగ్రెస్ ప్రముఖులు నిరసన తెలిపారు. నిరసనలో భాగంగా కాంగ్రెస్ ఎంపీలు చేతులకు తాళ్లు కట్టుకొని వినూత్నంగా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నివాసం సమీపంలో పెద్దఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలియజేశారు.
ఈ మెరుపు ధర్నాను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ దేశ చరిత్రలోనే బిగ్గెస్ట్ యాంటీ యూత్' పీఎం అని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం యువతకు అన్యాయం చేయడంతో పాటు వారిపై దాడులకు తెగబడుతోందని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. పేపర్ లీకేజీలపై నిరసన తెలుపుతూ వేలాదిమంది కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలు, విద్యార్థులు సోమవారం పార్లమెంట్ వైపు మార్చ్ నిర్వహించి.... నిరసనకారులు బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, లారీలతో విరుచుకుపడ్డారని మండిపడ్డారు.
నీట్ పేపర్ లీకేజీతో విద్యాశాఖ మంత్రిగా ఫెయిలైన ధర్మేంద్ర ప్రధాన్ తో కనీసం రాజీనామా చేయించలేని వీక్ ప్రధాని మోదీ అని రాహుల్ ఎద్దేవా చేశారు. దేశంలో 152 సార్లు పేపర్లు లీకై, 7.5 కోట్ల మంది విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారినా ఒక్క దోషికి శిక్ష పడలేదని నుండిపడ్డారు. చదువు, భవిష్యత్తుపై న్యాయమైన ప్రశ్నలు అడిగితే లాఠీదెబ్బలు, అరెస్టులు బహుమతిగా ఇస్తున్నారని ధ్వజమెత్తారు. పేపర్లు లీక్ నేరస్తులు స్వేచ్చగా తిరుగుతుంటే, న్యాయం కోసం గొంతెత్తిన విద్యార్థులను చిలక్కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని హితవు పలికారు. మన విద్యావ్యవస్థను ఆర్ఎస్ఎస్ తన గుప్పిట్లోకి తీసుకుందని, విద్యాసంస్థలన్నీ ఒకే ఒక్క సంస్థ చేతుల్లో నడుస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. దీనిపైనే దేశ యువత తిరగబడుతోందని, వారి డిమాండ్లను ప్రధాని వెంటనే అంగీకరించి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మోదీ కేవలం 'అసత్యం, హింస' అనే భారత్ వ్యతిరేక సూత్రాలను నమ్ముతూ యువతను అవమానిస్తున్నారని విమర్శించారు.