Wednesday, 29 July 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

కడప జిల్లా రైల్వే అభివృద్ధికి చర్యలు తీసుకోండి...

23 Jul 2026
05:44 PM
223

○ కేంద్ర మంత్రికి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి వినతి
○ యర్రగుంట్ల స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేయాలి..
○ కడప రైల్వే స్టేషన్లో రెండు షిఫ్టుల్లో రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలి...
○ కమలాపురంలో రైలు నిలుపుదలకు చర్యలు తీసుకోండి...

ఢిల్లీ   :
కడప జిల్లాలో రైల్వే అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతూ కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను ఢిల్లీలో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన పలు అంశాలను ప్రస్తావిస్తూ .... యర్రగుంట్ల రైల్వే స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేసి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.

 అంతేకాకుండా జిల్లా కేంద్రమైన కడప రైల్వే స్టేషన్లో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్ కౌంటర్ ను రెండు షిఫ్టుల్లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా కడప జిల్లాలోని కమలాపురంతో పాటు పలు రైల్వే స్టేషన్లలో మరిన్ని రైళ్లకు నిలుపుదల కల్పించాలని కోరారు. ప్రత్యేకించి కమలాపురంలో కోవిడ్ కు ముందు ఉన్న స్టాపింగ్ లను అలాగే కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. 

 జిల్లా ప్రజలకు మెరుగైన రైల్వే సేవలు, సౌకర్యాలు అందేలా ఈ అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవు ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.






Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!