* సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జిఎం సందీప్ మాథుర్ కు కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి లేఖ ...
* అనంతరం నేరుగా జీఎంతో ఫోన్లో మాట్లాడిన ఎంపి అవినాష్ ...
* పర్యాటక కేంద్రం గండికోటకు నిత్యం వచ్చే పర్యాటకులు...
* పరిశ్రమలు, స్టీల్ ప్లాంటు, అర్టీపీపీ వంటి పరిశ్రమలు...
* ఉద్యోగులు, విద్యార్ధులు తదితర అవసరాలను గుర్తించాలని వినతి....
కడప :
తిరుమల ఎక్స్ ప్రెస్ రైల్ ను వైఎస్ఆర్ కడప జిల్లాలోని ముద్దనూరు, కమలాపురం రైల్వేస్టేషన్లలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జిఎం సందీప్ మాథుర్ ను కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి కోరారు. అంతేకాకుండా ఈ విషయమై సౌత్ కోస్ట్ రైల్వే జోన్ జిఎం సందీప్ మాథుర్ కు లేఖ కూడా రాశారు. కడప ప్రాంతం నుంచి విశాఖపట్నం వరకు ప్రయాణించే ఏకైక రైలు తిరుమల ఎక్స్‌ప్రెస్ మాత్రమేనని అయన దృష్టికి తీసుకువెళ్లారు. ఇది మధ్యాహ్నం 1:30 గంటలకు గుంతకల్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి, సాయంత్రం 4 గంటలకు యర్రగుంట్ల,5:38 గంటలకు కడప చేరుకుంటుందని, ఈ ప్రయాణం మధ్యలో ఉన్న ముద్దనూరు, కమలాపురంలో నిలవడం లేదన్నారు. అంతేకాకుండా గుంతకల్లు నుంచి కడపకు చేరుకునేందుకు పైన గమనించినట్లుగా, రైలు కడప చేరుకునేలోపు చాలా ఖాళీ సమయం ఉంటుందని, దాదాపు 4 గంటల సమయం ఉందని వివరించారు. సాధారణంగా యర్రగుంట్ల నుండి కడపకు ప్రయాణించడానికి 30 నిమిషాలు పడుతుంది, కానీ యర్రగుంట్ల నుండి కడపకు చేరుకోవడానికి 1.38 గంటల సమయం పడుతుందని, కడప, తిరుపతిలలో రైళ్లను నియంత్రించడం వల్ల ఈ రైలుకు అప్ & డౌన్ రైళ్ల కోసం ఖాళీ సమయం ఉంటుందని వివరించారు.

అంతేకాకుండా, మీకు తెలిసినట్లుగా, ముద్దనూరు, కమలాపురం స్టేషన్ల మధ్య అనేక సిమెంట్ ప్లాంట్లు ఉన్నాయని, ముద్దనూరు- కమలాపురం స్టేషన్ల చుట్టుపక్కల మండలాల్లోని విద్యార్థులు, ఉద్యోగులు,రైతులు తరచుగా రైలును ఆపమని అభ్యర్థిస్తున్నారని పేర్కొన్నారు. ముద్దనూరు రైల్వే స్టేషన్ సమీపంలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో భారతదేశంలోని చారిత్రాత్మక గండికోట పర్యాటక ప్రదేశం, జమ్మలమడుగులో నిర్మాణంలో ఉన్న జెఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్, రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఉన్నాయని, ఇక్కడికి పర్యాటకులు, అధికారులు, ప్రజలు ప్రతి నిత్యం రాకపోకలు సాగిస్తుంటారని, మరో వైపు పులివెందుల నియోజకవర్గంలో జెఎన్‌టియు-ఇంజనీరింగ్ కళాశాల, ప్రభుత్వ-వైద్య కళాశాల, ప్రభుత్వ-వ్యవసాయ కళాశాల, ఏపీకార్ల్ సెంటర్, గోవిందరాయులు టెక్స్‌టైల్, సోము గ్లాస్ ఇండస్ట్రీ లు ఉన్నాయని అయన దృష్టికి తీసుకువెళ్లారు. వీటితో పాటు కర్నూలు జిల్లా సరిహద్దు మండలాలకు కూడా ముద్దనూరు రైల్వేస్టేషన్ సేవలు అందిస్తోందని, బ్రిటిష్ కాలం నుండి దాదాపు అన్ని రైళ్లు ముద్దనూరు (MOO) వద్ద ఆగుతున్నాయని, ప్రజల అవసరాన్ని, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, తిరుమల ఎక్స్‌ప్రెస్‌కు ముద్దనూరు, కమలాపురం స్టేషన్లలో హాల్ట్ కల్పించవలసిన అవసరాన్ని పరిగణించాలని అభ్యర్థిస్తున్నట్లు కోరారు.
జీఎంకు ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి రాసిన లేఖతో పాటు ఇటీవల ముద్దనూరు ప్రజలు, కమలాపురం సాధన కమిటి నాయకులు రాసిన లేఖలను కూడా జతపరచి పంపారు. ఎంపి వినతి మేరకు రైల్వే జీఎం సానూకులంగా స్పందించినట్లు ఎంపి పేర్కొన్నారు.