* ఏమి సాధించారని ఇంటింటికి తెలుగుదేశం అంటూ ప్రజల్లోకి వెళుతున్నారు...?
* చేసిన అభివృద్ది ప్రజలకు చెప్పే దమ్ముందా ...?
* పిచ్చిపట్టి ప్రజల్లోకి వెళ్తున్నారు...ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారు ...
* కమలాపురం వైసీపీ ఇన్ చార్జి నరేన్ రామానుజన్ రెడ్డి ధ్వజం.
కడప :
ప్రస్తుత కూటమి పాలనలో ఏం సాధించారని ఇంటింటికి తెలుగుదేశం అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారని కమలాపురం వైసీపీ ఇన్ చార్జి నరేన్ రామానుజన్ రెడ్డి ప్రశ్నించారు. కమలాపురంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అయన మీడియాతో మాట్లాడుతూ... మూడు పార్టీలు కలిసిన కూటమి ప్రభుత్వం ఇంటింటికి తెలుగుదేశం అనడంలో అర్థం ఏంటి ? చంద్రబాబు మాటల్లో రెండు పాయింట్లు పై వెళ్లాలని నాయకులకు చెప్పడం అంటే... కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు మొదటిదైతే ... వైసీపీపై పన్నుతున్న కట్రలపై రెండవదంటూ ప్రజల్లోకి వెళ్తున్నారా ? మీరు సాధించిన విజయాలు ఏంటి వైసీపీపై పన్నుతున్న కుట్రలేంటో చంద్రబాబు ప్రజలకు వివరించాలి.
ఎన్నికల ముందు చెప్పిన వాటిలో సూపర్ సిక్స్ పథకాలు అమలే లేవు. మొదటి సంవత్సరం ఇచ్చిన హామీలు అమలు చెయ్యలేదు. మూడవ సంవత్సరం ఏమిస్తారో తెలియదు. ఇచ్చిన తల్లికి వందనం చాలా వరకు కోతలు విధించారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు మోసం చేసింది. నిరుద్యోగ భృతి లేదు, 20 లక్షల ఉద్యోగాలు ఊసే లేదు. 26 మాసాలు ఏ విధంగా విజయం సాధించారని ప్రజల్లోకి వెళుతున్నారు. ప్రజల వీటన్నింటినీ గమనిస్తున్నారు వెళితే కూటమి నాయకులకు తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న దురాగాతలను ప్రశ్నిస్తే వైసిపి కుట్రలంటారా. చంద్రబాబు నాయుడు కి పూర్తిగా మతిభ్రమించింది.
చంద్రబాబు మాటలు విని కూటమి నాయకులు ప్రజల్లోకి వెళితే పిచ్చి పట్టిందంటారు. గత వైసిపి ప్రభుత్వం గడపగడపకు మన ప్రభుత్వం దాన్ని కాపీ కొట్టింది కూటమి. 99% హామీలు నెరవేర్చి గడపగడపకు మన ప్రభుత్వం అంటూ ప్రజల్లోకి వెళ్లింది వైసిపి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లి హామీలన్నీ నెరవేర్చామంటూ చెప్పే దమ్ము ధైర్యం ఉందా. కూటమి నాయకులు గ్రామాల్లోకి వస్తే ప్రజలంతా ప్రశ్నించి నిలదీయండి.