* స్కిల్ డెవలప్ మెంట్ కేసులో వాంగ్మూలం ఇచ్చినందుకు ...?
* మహిళా ఐఎఎస్ అధికారి కాకి సునీత ఇప్పుడు ప్రతీకారమా ...?
* నాలుగు గోడల మధ్య జరగాల్సిన వ్యవహారాన్ని కెమెరా ముందు ... ?
* కించపరిచే తంబ్నెయిల్స్ ...హెడ్లైన్స్ తో చెలరేగిపోయిన ఓ వర్గం మీడియా ....
* ఐఎఎస్ లో తీవ్ర మథనం ....
Astranews desk :
ఎపిలో ఐఎఎస్ అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళా ఐఎస్ఎస్ అధికారులపై సీరియస్ అవ్వడం ఇప్పుడు ఒక పెద్ద వివాదాస్పదం అవుతుంది. ప్రత్యేకించి మహిళా ఐఎఎస్ అధికారి కాకి సునీతపై చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చెయ్యడం...మీడియాలో అమెపై పెద్ద ఎత్తున కించపరిచే తంబ్నెయిల్స్ ... హెడ్లైన్స్ తో చెలరేగిపోయిన ఓ వర్గం మీడియా కథనాలపై కూడా వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. అయితే మహిళా ఐఎఎస్ అధికారి కాకి సునీతపై సిఎం చంద్రబాబు చెలరేగిపోవడానికి ప్రధాన కారణం కూడా లేకపోలేదు. ఇందుకు గత ప్రభుత్వ హాయంలో చంద్రబాబు అరెస్టు కు దారితీసిన కేసే... అమెపై సిఎం చంద్రబాబు అసంతృప్తి... అసహానానికి కారణాలుగా తెలుస్తొంది.
మహిళా ఐఎఎస్ అధికారి కాకి సునీత మాజీ సిఎస్ కాకి మాధవరావు కుమార్తె. ఈమె స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఒక వాంగ్మూలం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి అది ఇబ్బందికరంగా మారింది. అందుకే ఆమెను చంద్రబాబు నాయుడు ప్రతి కలెక్టర్ల సమావేశంలోనూ పదే పదే టార్గెట్ చేస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి ఆరోపించారు. ఏప్రిల్లో జరిగిన ఒక ఐఏఎస్ ల సమావేశంలో ఆమె స్వయంగా పదే పదే తనను అవమానిస్తున్నారంటూ తన బాధను వెళ్లగక్కుకున్నారు అని కూడా సుధాకర్ బాబు చెప్తున్నారు. ఏప్రిల్ 21 సివిల్ సర్వీస్ రోజున సివిల్ సర్వీస్ డే అనే ఒక రోజు జరిగింది. ఆ సమావేశంలో వీరు సునీత ఐఏఎస్ అధికారుల సంఘం సమావేశంలో తనకు జరిగిన అవమానాన్ని కూడా అక్కడ చెప్పుకున్నారు బాధపడ్డారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేసింది. ఒక ఐఏఎస్ అధికారి తనకు అవమానం జరిగిందని పదే పదే తన కొలీగ్స్ మధ్యలో సహచార అధికారుల మధ్యలో చెప్పుకుంటుంది. అంటే ఎంత అవమానం పాలై ఉంటది ఎంత దారుణాలు జరిగి ఉంటాయో అర్దం చేసుకోవచ్చు.
చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారం నడిచింది. ఆ సమయంలో అధికారినిగా ఉన్న సునీత నోట్ ఫైల్ మీద
అభ్యంతరాలు తెలిపారు. కొన్ని ఒప్పందం ప్రకారం సీమెన్స్ కంపెనీ స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో 90% నిధుల్ని సమకూర్చాలి. కేవలం 10% మాత్రమే ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ఆ సీమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుముందే ప్రభుత్వం తరపున మొత్తం 100% నిధుల్ని విడుదల చేసేందుకు ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి రావడంతో... ఆమె ఇది కరెక్ట్ కాదు. ఇదంతా అనుమానాస్పదంగా ఉంది. అవతల వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మొత్తం నిధులు మనం ఇవ్వడం ఏంటి అని అభ్యంతరం తెలుపుతూ నోటిఫై నోటిఫైల్ రాశారు. వైసీపీ ప్రభుత్వ హాయంలో దర్యాప్తు చేపించినప్పుడు సిఐడి దగ్గర ఆ విషయాన్ని ఆమె వాంగ్మూలం రూపంలో కూడా చెప్పారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని చంద్రబాబు నాయుడు దళితురాలైన కాకి సునీతను పదే పదే టార్గెట్ చేస్తూ వస్తున్నారు అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా రెండేళ్ల క్రితం అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా సునీతను టార్గెట్ చేయడం దాన్ని తెలుగుదేశం పార్టీకి అనుకూలం అని పేరున్న కొన్ని సోషల్ మీడియా అకౌంట్లలో ఆమెకు నెగిటివ్ గా క్యాంపెయిన్ నడపడం ట్రోలింగ్ చేయడం లాంటివి కూడా చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులను చేతగాని వ్యక్తుల్లాగా ఒక పద్ధతి ప్రకారం చిత్రీకరించేసి వాళ్ళందరినీ సమర్ధవంతులుగా మార్చేందుకు సమర్థవంతంగా నడిపించేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని అర్థం వచ్చేలాగా ఒక క్యాంపెయిన్ పరోక్షంగా వెనుక నడుస్తోందన్న ఒక అభిప్రాయాన్ని ఐఏఎస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తే ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగానో లేకుంటే విమర్శిస్తూ క్యాంపెయిన్ చేయలేదు. కేవలం మొత్తం అంతా అధికారులని టార్గెట్ గా చేసుకొని ఒక క్యాంపెయిన్ నడిచింది. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి? కలెక్టర్లను, ఐఏఎస్ లని మహిళా ఐఏఎస్ లని మనం ఏమన్నా ఎలాంటి హెడ్ లైన్ పెట్టిన వాళ్ళు ఏమీ చేయలేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయన ఒక్కరికి మనం నెగిటివ్ గా రాయకపోతే చాలు ఆ తర్వాత ఎవరి మీద ఎలాంటివి తంబ్నెయిల్ పెట్టిన... హెడ్లైన్ పెట్టిన ఏమి కాదు అన్న ధైర్యం ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి వచ్చింది అన్న చర్చ కూడా నడుస్తుంది.
ఈ రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ తర్వాత ఈ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల ఆత్మగౌరవం కూడా ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గమనించాల్సింది ఎమంటే.... ఐఏఎస్ అధికారులు నిజంగా తప్పు చేసి ఉంటే మందలించవచ్చు. అది కూడా మందలించాలనుకున్నప్పుడు ఐఏఎస్ ని పిలిచి నాలుగు గోడల మధ్య వాళ్ళ క్లాస్ తీసుకోవచ్చు. లేదా వాళ్ళకు సమర్థత లేదు అనుకుంటే బదిలీ చేయవచ్చు. అలా కాకుండా ఒకవైపు కాన్ఫరెన్స్ మొత్తం లైవ్ పెట్టి పబ్లిక్ చూస్తూ ఉండగా ఒక్కో అధికారి మీద చంద్రబాబు నాయుడు ఇలా సీరియస్ అవ్వడం కొందరిని ప్రత్యేకంగా టార్గెట్ చేయడం... ఇవన్నీ చూసిన తర్వాత దీనివల్ల తెలుగుదేశం పార్టీకి మరింత ఇబ్బందికర పరిస్ధితే. అంతేకాకుండా అమెను కించపరిచే తంబ్నెయిల్స్ ... హెడ్లైన్స్ తో ఓ వర్గం మీడియా చెలరేగిపోవడం ద్వారా ఐఏఎస్ ల ఆత్మగౌరవం దెబ్బతిన తర్వాత ఇక హార్ట్ ఫుల్ గా పని చేయలేని పరిస్ధితి. ఆ పరిస్థితిని సృష్టించుకుంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకే కాదు రాష్ట్రానికి ... రాష్ట్ర ప్రజలకు కూడా నష్టం తప్పదన్న భావన వ్యక్తమవుతోంది.