Friday, 25 September 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / తెలంగాణ

రేవంత్ రెడ్డి మాస్​ లీడర్... కీలక వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ .....

13 Sep 2026
03:08 PM
10

* మంత్రి పదవి నుంచి తొలగించినందుకు బాధ లేదు ...
* మంత్రి పదవి ముఖ్యం కాదు....ప్రజల్లో చిరస్థాయిగా ఉండటమే లక్ష్యం ...
* రాహుల్‌గాంధీని ప్రధానిగా చేయడమే తమ లక్ష్యం ....

Konda Sureka hot comment : 
రేవంత్ రెడ్డి మాస్​ లీడర్... కాంగ్రెస్ ను వీడేది లేదు...రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసేందుకు పోరాడతాం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు... మాజీ మంత్రి కొండా సురేఖ. తెలంగాణా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ తర్వాత, వరంగల్​లో తొలిసారి కొండా సురేఖ, కొండా మురళి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్​రెడ్డి లాంటి మాస్‌ లీడర్‌ కాంగ్రెస్‌కు అవసరమని చెప్పిన మెుదటి వ్యక్తిని తానేనని కొండా సురేఖ తెలిపారు. రేవంత్‌రెడ్డి రైతుల కోసం పాదయాత్ర చేశారని, అదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని, తనకు మంత్రి పదవి వచ్చిందన్నారు. ఎలాంటి తప్పులు చేయకుండా మంత్రి బాధ్యతలు నిర్వర్తించానన్నారు.
 
మంత్రి పదవి నుంచి తొలగించినందుకు బాధ లేదు   : 
మంత్రి పదవి నుంచి తొలగించినందుకు బాధ లేదను....కానీ అకారణంగా పదవి నుంచి తొలగించారని బాధ ఉందని కొండా సురేఖ అన్నారు. మంత్రి పదవి నుంచి తొలగించిన అనంతరం అల్లర్లు చేయాలని కొందరు ఫోన్​ చేశారని కొండా సురేఖ వెల్లడించారు. కానీ తాను వారిని వారించానన్నారు. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కార్యకర్తలకు చెప్పానని, అండగా ఉన్నందుకు వారికి ధన్యవాదాలని చెప్పారు.

మంత్రి పదవి ముఖ్యం కాదు....ప్రజల్లో చిరస్థాయిగా ఉండటమే లక్ష్యం .. : 
పదవులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయన్న సురేఖ, ప్రజల్లో చిరస్థాయిగా ఉండటమే తమ లక్ష్యమన్నారు. ప్రస్తుతం అవకాశవాద రాజకీయాలు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాము నమ్మిన రాజశేఖర్‌రెడ్డి కోసం గతంలో మంత్రి పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. గతంలో కొంతమంది తమకు టికెట్ రాకుండా చేశారని, అప్పుడు కాంగ్రెస్‌లో టికెట్ రాకపోతే, కేసీఆర్‌ పిలిచి వరంగల్‌ ఈస్ట్ టికెట్ ఇచ్చారని తెలిపారు. అప్పట్లో కేసీఆర్​ తమకు అవకాశం ఇచ్చినందుకు నాడు మంత్రిగా ఉన్న వ్యక్తిని ఓడించామన్నారు. మంత్రి పదవి పోయిందని ఇంట్లో కూర్చోబోమని, ప్రజల్లోనే ఉంటామని, మున్సిపల్ ఎన్నికల్లో అన్నీ సీట్లు గెలుస్తామని సురేఖ స్పష్టం చేశారు.
 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!