Friday, 25 September 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / వాణిజ్యం

యూపీఐ లావాదేవీలపై కేంద్రం కీలక ఆదేశాలు..

15 Sep 2026
01:58 PM
63

* రూ.2 వేల వరకు UPI చెల్లింపులపై ఛార్జీలు లేవని స్పష్టం.. 
* బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లకు కేంద్రం ఆదేశం..
*వినియోగదారులు, వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులకు బిగ్ రిలీఫ్ ...

UPI Charges Big relief:

యూపీఐ లావాదేవీలపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది.  రూ.2 వేల వరకు UPI చెల్లింపులపై ఛార్జీలు లేవని,  ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి రుసుము విధించకూడదని...బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లకు కేంద్రం ఆదేశించింది. రూ. 2వేల వరకు రూపే డెబిట్ కార్డు చెల్లింపులపైనా చార్జీలు లేవన్న కేంద్రం.. రూ.2 వేలు దాటిన కొన్ని వ్యాపార లావాదేవీలపై MDR పరిశీలన ద్వారా చార్జీల వసూళ్లు అలోచించాలని ఆదేశించింది. దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి, చార్జీల భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

రూ. 2,000 వరకు ఎలాంటి చార్జీలు లేవు   :
ఈ కొత్త నిబంధనల ప్రకారం యుపిఐ (UPI Charges) ద్వారా జరిపే రూ. 2,000 వరకు లావాదేవీలపై ఎలాంటి ట్రాన్సాక్షన్ చార్జీలు విధించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు కేవలం యుపిఐకే కాకుండా రూపే (RuPay) డెబిట్ కార్డ్ ద్వారా జరిపే చెల్లింపులకు కూడా వర్తిస్తాయి. బ్యాంకులు లేదా పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు నేరుగా గానీ, ఇతర మార్గాల్లో గానీ ఈ పరిమితి లోపు జరిపే డిజిటల్ చెల్లింపులపై రుసుములను వసూలు చేయడానికి వీల్లేదు.

వినియోగదారులు, వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులకు బిగ్ రిలీఫ్   :
ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా కిరాణా షాపులు, వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. చెల్లింపులు జరిపే కస్టమర్‌తో పాటు, ఆ డబ్బును స్వీకరించే మర్చంట్‌పై కూడా ఎలాంటిదనపు భారం పడదు. ఉదాహరణకు, ఒక స్టోర్‌లో రూ. 800 యుపిఐ ద్వారా చెల్లిస్తే, కస్టమర్‌కు లేదా వ్యాపారికి ఎలాంటి చార్జీలు వర్తించవు. ఈ నిబంధన పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007 లోని సెక్షన్ 10A కింద అమలులోకి వచ్చింది. 

రూ. 2,000 పైన లావాదేవీల్లోను సామాన్యులకు ఉరట... : 
రూ. 2,000 దాటిన పెద్ద మొత్తాల లావాదేవీలపై చార్జీల విషయమై ఈ నోటిఫికేషన్‌లో ఎలాంటి రుసుములను పేర్కొనలేదు. అయితే సాధారణ పర్సన్-టు-పర్సన్ (P2P) లావాదేవీలు ఎప్పటికీ ఉచితంగానే ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమల్లోకి వచ్చినా, అది కేవలం నిర్దిష్ట పరిమితి దాటిన పెద్ద మర్చంట్ ట్రాన్సాక్షన్లకు మాత్రమే వర్తిస్తుందని, సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేసింది.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!