Friday, 25 September 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / సినిమా

శివగామి పాత్రను మంచి ....మరో పవర్ ఫుల్ రోల్ లో రమ్యకృష్ణ ....!

15 Sep 2026
05:38 PM
50

 * డేవిడ్ రెడ్డి చిత్రంలో కమలారెడ్డి పాత్రలో రమ్యకృష్ణ ...

*స్పెషల్ పోస్టర్ రిలీజ్ తో విడుదలైన పవర్ ఫుల్ లుక్స్ ...

 Ramya Krishna :

'బాహుబలి'లో శివగామి పాత్ర తర్వాత మరో పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు రమ్య కృష్ణ(Ramya Krishna). మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న 'డేవిడ్ రెడ్డి' (David Reddy)చిత్రంలో ఆమె కమల రెడ్డిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్ పై వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మారియా ర్యాబోషప్క హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతోంది.  

Article Image

రమ్యకృష్ణ బర్త్ డే సందర్భంగా మంగళవారం ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. కమలా రెడ్డిగా ఆమె లుక్ పవర్ ఫుల్ గా ఉంది. ఆమె ఖడ్గంతో శత్రువులను తుదముట్టించి తన ఆసనంపై కూర్చుని ఫెరోషియస్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు. రమ్యకృష్ణ కెరీర్ లో కమలా రెడ్డి పాత్ర ఐకానిక్ క్యారెక్టర్ గా గుర్తుండిపోనుందని మేకర్స్ చెబుతున్నారు.

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!