Tuesday, 24 November 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

కడప టిడిపి నేతల మధ్య డిఎస్సీ పోస్టింగ్ చిచ్చు...!

08 Oct 2026
12:03 PM
563

*ఇటీవలే కడప డిఎస్పీగా రామకృష్ణుడిని నియమించిన ప్రభుత్వం...
*పట్టుబట్టి నియామకాన్ని రద్దు చేయించిన కమలాపురం నేత...
* నూతన డిఎస్పీగా శ్రీకాకుళంలో డిఎస్పీగా పనిచేస్తున్న భవాని కడపకు బదిలీ...

కడప  : 
కడప టిడిపి నేతల్లో డిఎస్పీ పోస్టింగ్ వ్యవహారం మరో చిచ్చు రేపింది. కడప డిఎస్పీగా ఇటీవలే రామకృష్ణుడిని ప్రభుత్వం నియమించింది. ఈయన ప్రస్తుతం నెల్లూరు ఎసిబి డిఎస్పీగా పని చేస్తున్నారు. అక్కడి నుంచి కడప డిఎస్పీగా ప్రభుత్వం బదిలీ చేసింది. కానీ ఉత్తర్వులు వెలువెడిన కొన్ని గంటల్లోనే ఈ నియమాకంపై రచ్చ మొదలైనట్లు సమాచారం. చివరకు ఉత్తర్వులే రద్దు అయ్యే వరకు దారితీసింది. 

కడప డిఎస్పీ పరిధిలో కడప, కమలాపురం నియోజకవర్గాలు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే చాలా కాలంగా ఇక్కడ ఇన్ చార్జి డిఎస్పీ బాలస్వామిరెడ్డి కొనసాగుతుండగా... ప్రభుత్వం ఈ మేరకు రెగ్యులర్ డిఎస్పీని నియమించింది. ఇందులో భాగంగా కడప డిఎస్పీగా రామకృష్ణుడిని నియమించగా...ఈ నియామకం పూర్తిగా  టిడిపి నేత, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే మాధవీరెడ్డి భర్త శ్రీనివాసులరెడ్డి ఏకపక్షంగా నియామకం జరిగేలా పావులు కదిపారన్న సమాచారం మేరకు ... కమలాపురం నియోజకవర్గానికి చెందిన నేత ఉత్తర్వులు వెలువడినా ఆ బదిలీపై పేచి పెట్టారని సమాచారం. కడప డిఎస్పీ పరిధిలో కమలాపురం నియోజకవర్గం కూడా వస్తున్నందున ... ఏకపక్షంగా ఎలా పోస్టింగ్ ఇస్తారంటూ కమలాపురం నేత సీరియస్ అయ్యారని సమాచారం. నా ప్రమేయం లేకుండా ..అది కూడా స్థానిక సంస్థల  ఎన్నికల సమయంలో  ఇలా ఎలా చేస్తారని ప్రశ్నించినట్లు వినికిడి. ఈ నియామకం వ్యవహారాన్ని కమలాపురం టిడిపి నేత ఏకంగా సిఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం. దీంతో అసలే పార్టీ పెద్దల వద్ద ఇటీవల కొంత కడప నేతలకు ఇబ్బందికర పరిస్ధితులు ఎదుర్కొంటుండగా....ఈ వ్యవహారంలో కమలాపురం నేతకు కలిసొచ్చినట్లయ్యింది. 

ఈ పరిణామాల కారణంగానే  ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేసి మరి శ్రీకాకుళం జిల్లాలో పని చేస్తున్న డిఎస్సీ భవానిని కడప డిఎస్పీగా బదిలీ చేశారు.  ఈ బదిలీ రద్దు వ్యవహారం కడప టిడిపి నేతల్లోను తీవ్ర ఆగ్రహావేశాలన్ని రేపినట్లు తెలుస్తుంది. బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం కావాలని ఇలా రద్దు చేయించడం ఎంటన్నది కడప నేతల వాదనగా వినవస్తుంది. అయితే ఇప్పటికే కడప, కమలాపురం టిడిపి నేతల మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమంటుండగా...ఇప్పుడు కడప డిఎస్సీ నియామకం రద్దు వ్యవహారం ఇరువురి మధ్య మరింత ఆగాధాన్ని పెంచినట్లు అయా వర్గాలు పేర్కొంటున్నాయి. 

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (1)

S
Sreenivasa Reddy. Devara • 08 Oct, 2026

Wast gov't
Govt kanusanullo kakilu