Tuesday, 24 November 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

కడప టిడిపిలో మేయర్ వార్ ...!

15 Oct 2026
12:51 PM
556

* కొలిక్కి రానీ మేయర్ అభ్యర్ధి ఎంపిక ...
* గత రాత్రి కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి నివాసానికి...
* మాజీ మంత్రి ఆది, పులివెందుల టిడిపి ఇన్ చార్జి బిటెక్ రవి, అలాంఖాన్ పల్లె మన్మోహన్ రెడ్డి...
* గంటల తరబడి చర్చలు..అయినా కొలిక్కి రానీ పంచాయతీ ...
* రేపు ఇన్ చార్జి మంత్రి మరోమారు కడప ఎమ్మెల్యే, శ్రీనివాసులరెడ్డిలతో చర్చలు జరిపే అవకాశం ...

కడప  : 
కడప టిడిపిలో మేయర్ వార్ కు ముగింపు కార్డు పడటం లేదు. ఎన్నికల హడావుడి మొదలైన నాటి నుంచి టికెట్ కోసం ఇరువర్గాలు పోటాపోటీగా పోటీ పడుతుండటంతో చిలికి చిలికి గాలి వానలా మారింది. బుధవారం రాత్రి ఇరువర్గాల మధ్య రాజీప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో ఇప్పటికి అదే ఉత్కంఠ కొనసాగుతుంది. 

కడపనగర పాలక సంస్థలో  మొదటి నుంచి వైఎస్సార్ కుటుంబ ప్రభావం స్పష్టంగా కనిపిస్తొంది. ఇప్పటి వరకు మూడు సార్లు ఎన్నికలు జరిగితే...ఒకమారు కాంగ్రెస్, రెండుసార్లు వైసీపీ జెండా ఎగరేసింది. అయితే ప్రస్తుతం అక్కడ టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో రాజకీయ సమీకరణాలు ఉత్కంఠగా మారాయి. వైసీపీ ఎలాగైనా గెలిచి పట్టు నిరుపించుకోవాలని ముందస్తుగానే అభ్యర్ధులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుండగా... టిడిపిలో మాత్రం  అభ్యర్థి ఎంపికపై చర్చ రచ్చను తలపిస్తుంది. 

కడపలో ఎమ్మెల్మే మాధవీరెడ్డి, అమె భర్త శ్రీనివాసులరెడ్డిలు తమ మద్దతుదారులకు మేయర్ టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని పట్టుబడుతున్నారు. కానీ గత సార్వత్రిక ఎన్నికల సమయంలోను...అంతకుముందు నుంచి కడప అసెంబ్లీ సీటు అలాంఖాన్ పల్లెకు చెందిన సీనియర్ నేత లక్ష్మీరెడ్డి తన కోడలు మాజీ కార్పోరేటర్ ఉమాదేవి కోసం ఆశించి పార్టీ కోసం పనిచేశారు. కానీ ఈ టికెట్ విషయంలో ఇద్దరు పోటీపడిన నాటి నుంచి ఇరువురి మధ్య గ్యాప్ కొనసాగుతూ వచ్చింది. అనంతరం పార్టీ అధికారంలోకి వచ్చాకా ఇరువురి మధ్య అగాథం మరింత పెరుగుతూ వచ్చింది. ఒకరిపై ఒకరు పార్టీకి ఫిర్యాదు చేసుకునే వరకు వచ్చింది. 

ఇలాంటి పరిస్ధితుల్లో ఇప్పుడు నగర పాలక సంస్థ ఎన్నికలు రానేవచ్చాయి. గతంలో పార్టీ కోసం పని చేసినందుకు...గత ఎన్నికల ముందు టికెట్ హామీ ఇచ్చి సీటు ఇవ్వనందుకు ఇప్పుడు మేయర్ సీటు ఇవ్వాలని లక్ష్మీరెడ్డి వర్గం పట్టుబడుతొంది. ఇదే సందర్బంలో ఎమ్మెల్యే మాధవీరెడ్డి , రీజినల్ కోఅర్డినేటర్ శ్రీనివాసులరెడ్డి సైతం తాము చెప్పిన వారికి టికెట్ ఇవ్వాలంటూ పట్టుడుతున్నారు. దీంతో ఎమ్మెల్యే అదిష్టానం ఒకరికి నో చెబితే మరొకరి పేరు తెరపైకి తీసుకువస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటొంది. కానీ మరో వైపు లక్ష్మీరెడ్డి వర్గం మాత్రం టికెట్ తమకే ఇవ్వాలంటూ పట్టుబడుతుండటం... అదిష్టానం ఎమి చెప్పలేని పరిస్ధితుల్లో రాజీమార్గాన్ని సూచించినట్లు సమాచారం. 

అదిష్టానం సూచన మేరకు వైసీపీ మీద కసిగా విమర్శలు చేసే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, పులివెందుల టిడిపి ఇన్ చార్జి బిటెక్ రవిలు అలాంఖాన్ పల్లె లక్ష్మీరెడ్డి కుమారుడు మన్మోహాన్ రెడ్డిని వెంట బెట్టుకుని ఎమ్మెల్యే మాధవీరెడ్డి, శ్రీనివాసులరెడ్డి ఇంటికి వెళ్లినట్లు సమాచారం. మొదటి ఈ అంశంపై చర్చించేందుకే విముఖత చూపిన ఎమ్మెల్యే మాధవీరెడ్డి, అమె భర్త శ్రీనివాసులరెడ్డిలు అయిష్టతతోనే గంటల తరబడి చర్చలు జరిపినట్లు తెలిసింది. కానీ తాము చెప్పిన వారికే మేయర్ టికెట్ కావాలని ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తొంది. కానీ అదిష్టానం చెప్పిన సమాచారాన్ని కూడా చర్చలకు వెళ్లిన ఆదినారాయణరెడ్డి, బిటెక్ రవిలు ఎమ్మెల్యే మాధవీరెడ్డి, శ్రీనివాసులరెడ్డిలకు వివరించినట్లు వినికిడి. మొత్తం మీద చర్చలైతే గంటల తరబడి సాగినా ఫలితం మాత్రం తేలలేదని ప్రచారం సాగుతొంది. 

ఇదే అంశంపై శుక్రవారం జిల్లా ఇన్ చార్జి మంత్రి సవిత కడపకు వచ్చి ఎమ్మెల్యే మాధవీరెడ్డి, శ్రీనివాసులరెడ్డిలతో మరోమారు చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈ సమావేశం అనంతరం మేయర్ అభ్యర్ధి ప్రకటనలో క్లారిటి వచ్చే అవకాశం ఉందని, పార్టీ అదిష్టానం కూడా అప్పుడే ఒక నిర్ణయం తీసుకోవచ్చునని పార్టీ వర్గాలు పేర్కోంటున్నాయి. ఇప్పటి వరకైతే తమ మాటే నెగ్గాలనే పట్టుదలతోనే రెండు వర్గాలు కనపడుతుండగా...మరి ఇన్ చార్జి మంత్రి సవితి చర్చలు అనంతకం వరకు వేచి చూడాలని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!