* మున్సిపల్ ఎన్నికలపై మాజీ బీజేపీ ఎంపి సుబ్రమణ్య స్వామి సంచలన ట్విట్ ..!!
*ఎన్నికల నిబంధనలపై న్యాయపోరాటం చేస్తానంటూ పోస్టు....
Astranews :
ఎపి మున్సిపల్ ఎన్నికలపై ఇప్పటికే రాజకీయ దూమారం రేపుతుండగా... ఇప్పుడు మాజీ బిజేపి ఎంపీ సుబ్రమణ్య స్వామి సంచలన ట్వీట్ చేయడం కలకలం రేపుతుంది. ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల తీరు పై ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. ఏపీలో పరిణామాల పైనా తాజాగా అయన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో రూల్ ఆఫ్ లా స్థానంలో జంగిల్ రాజ్ నడుస్తుందా అని ప్రశ్నిస్తూ....స్థానిక ఎన్నికల్లో అక్రమాలపైన సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. చట్టబద్ధమైన పాలన స్థానంలో అరాచక పాలన వస్తోందా ? ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం ఇక చచ్చిపోయినట్టేనా? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల నిబంధనల పైన తాను కోర్టుకు వెళ్తానంటూ క్లారిటి ఇచ్చారు.
ఏపీలో స్థానిక ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఘటనల పైన మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ట్వీట్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. స్థానిక ఎన్నికల ఘటలను ప్రస్తావిస్తూ...స్వేచ్ఛాయుతమైన ఎన్నికలే ప్రజాస్వామ్యానికి పునాది అంటూ పేర్కొన్నారు. రాజకీయ, అధికార ప్రయోజనాల కోసం..ప్రజాస్వామ్య పునాదులను బలి చేయొద్దని సుబ్రహ్మణ్యస్వామి సూచించారు. ఎన్నికల సమగ్రతను, పారదర్శకతను కాపాడాలని ఆకాంక్షించారు. ఎన్నికల కోసం కఠినమైన మార్గదర్శకాలు అమలు చేయాలని కోరుతూ తాను ఇక కోర్టును ఆశ్రయించబోతున్నట్లు సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ సమయం లో చోటు చేసుకున్న ఆందోళనలకు ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.
కాగా, ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఎక్స్ ద్వారా సుబ్రమణ్య స్వామి ఈ వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. ఏకగ్రీవాల పైన వైసీపీ కోర్టుకు వెళ్లగా...వైసీపీ పిటీషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి కీలక సూచనలు చేసింది. వైసీపీ అభ్యంతరాల పైన పరిశీలన చేసి తిరిగి నామినేషన్లకు అవకాశం ఇవ్వాలని నిర్దేశించింది. ఎన్నికల సంఘం కొన్ని ప్రాంతాల్లో రీ నామినేషన్ కు అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. కానీ అతికష్టం మీద నామినేషన్లు వేయనిచ్చినా ...ఎన్నికల రోజు మాత్రం అధికార యంత్రాంగం మొత్తం ఎకమై అధికార పక్షం కోసం పనిచేసింది. అంతేకాదు పులివెందులలో పోలింగ్ రోజున మాజీ సీఎం జగన్ తమ పోలింగ్ ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించ కుండా దౌర్జన్యం చేస్తున్నారంటూ ధర్నాకు దిగారు. దీంతో అయనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే రీపోలింగ్ కోరుతూ పులివెందులలో కౌంటింగ్ కు అనుమతి ఇవ్వద్దని హైకోర్టులో ఎంపీ అవినాశ్ రెడ్డి పిటీషన్ దాఖలు చేయగా.. కోర్టు తిరస్కరించింది. దీంతో ఎన్నికల ఫలితాలు సైతం వెల్లడయ్యాయి.
తాజాగా మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఈ పరిణామాల మధ్యే సుబ్రహ్మణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దీంతో మరోసారి ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన అంశాలు తెరపైకి వచ్చాయి. సుబ్రమణ్య స్వామి సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ఇప్పుడు ఎపి రాజకీయాల్లో ఆసక్తి కర చర్చగా మారింది.