Thursday, 28 May 2026
Astra News

Astra News

హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయం సినిమా క్రీడలు ఆసక్తికరమైన నిజాలు వాణిజ్యం టెక్నాలజీ జాతీయ వార్తలు అంతర్జాతీయ వార్తలు నేర వార్తలు భక్తి వార్తలు
Home / ఆంధ్రప్రదేశ్

SIR స‌ర్వేపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు .... !

27 May 2026
02:46 PM
10

* స‌ర్వే కుట్రల ప‌ట్ల వైసీపీ క్యాడ‌ర్ అప్ర‌మ‌త్తంగా ఉండాలి ..
*ప‌శ్చిమ బెంగాల్‌లో 91 ల‌క్ష‌ల ఓట్ల‌ను తొల‌గిస్తే.. #TMC ఓడిపోయింది 31 ల‌క్ష‌ల తేడాతో..
* త‌మిళ‌నాడులో 74 ల‌క్ష‌ల ఓట్ల‌ను తొలగిస్తే.. #DMK ఓడింది 17 ల‌క్ష‌ల తేడాతో..
*ఎపిలో ఓట్లు పెరిగితే వైసీపీ ఓడింది ... అందుకు అప్రమత్తంగా ఉండాలి....

తాడేపల్లి   : 

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.ఎన్నికల సంఘం త్వరలో చేపట్టబోయే సర్‌ (SIR) ప్రక్రియపై మరియు కూటమి ప్రభుత్వ పాలనపై ఆయన తీవ్రమైన విమర్శలు గుప్పించారు.

అలాగే సర్‌ (SIR) ప్రక్రియపై  శ్రేణులకు హెచ్చరిక చేశారు.  ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ప్రారంభం కానున్న సర్‌ ప్రక్రియ విషయంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓట్ల తొలగింపుపై ఆందోళన వ్యక్తం చేశారు.  గత ఎన్నికల్లో ఓట్లు పెరగడం వల్లే వైసీపీ ఓడిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఓట్లు పెరిగినా, తగ్గినా రెండూ ప్రమాదకరమేనని పేర్కొన్నారు. ఇందుకు ఇతర రాష్ట్రాల ఫలితాలను ఉదాహరణలుగా చెప్పారు. ఈ సర్‌ ప్రక్రియ ద్వారా  ప‌శ్చిమ బెంగాల్‌లో 91 ల‌క్ష‌ల ఓట్ల‌ను తొల‌గిస్తే..TMC ఓడిపోయింది 31 ల‌క్ష‌ల తేడాతోనని .. త‌మిళ‌నాడులో 74 ల‌క్ష‌ల ఓట్ల‌ను తొలగిస్తే..DMK ఓడింది 17 ల‌క్ష‌ల తేడాతోనని వివరించారు. మ‌మ‌తా బెన‌ర్జీ పోటీ చేసిన భ‌వానీపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో 45,982 ఓట్లు తొల‌గిస్తే.. 15 వేల ఓట్ల‌తో ఆమె ఓడిపోయారని, స్టాలిన్ పోటీ చేసిన కొల‌తూర్ నియోజ‌క‌వ‌ర్గంలో 71 వేల ఓట్లు తొల‌గిస్తే.. 8 వేల ఓట్ల‌తో ఆయ‌న ఓడిపోయారని, ఇది ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలన్నారు. 


కానీ ఎపిలో మాత్రం ఓట్లు పెరిగినందువల్ల ఓడిపోయామని, అక్కడ ఓట్లు తీసేయడం వల్ల వాళ్లు ఓడిపోయారు. ఈ రెండూ డేంజరే. ఊరికి యాభై మన ఓట్లను తీసేస్తే చాలు.. నియోజకవర్గానికి 5వేలు పోయినట్టే. అదే సమయంలో టీడీపీ బోగస్ ఓట్లమీద కూడా మనం దృష్టిపెట్టాలి. కుప్పట్లలో అది మన కళ్లెదుటే కనిపించింది. కుప్పంలో ఓట్ల జాబితా ఒక్కసారి చూస్తే 22వేల అనుమానాస్పద ఓట్లు ఉన్నాయి. ఒకే పేరు ఐదుసార్లో, పది సార్లో కనిపిస్తుంది. లిస్టులో ఆ పేరు కనిపించిన ప్రతిసారి కూడా తండ్రి పేరు చూసినా, లేక భర్త పేరు చూసినా సీమ్ ఉంటాయి. ఏపీలో ఓట్ల జాబితా ఓ హిస్టరీ అండ్ మిస్టరీ. ఇలాంటి బోగస్ ఓట్లు, తప్పుడు ఓట్లు మీద దృష్టిపెట్టాలి. అందుకే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నా అని వైఎస్సార్సీపీ శ్రేణుల్ని ఉద్దేశించి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.

 

Swasthik News

Share this Article

A

Astra News

Author

Reporting unbiased news and stories for Swasthik News.

Comments (0)

No comments yet. Be the first to share your thoughts!